లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ABN , First Publish Date - 2021-10-27T05:10:26+05:30 IST

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొనడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు
ప్రమాదానికి గురైన ట్రావెల్స్‌ బస్సు

 12 మందికి తీవ్రగాయాలు

 ప్రమాదానికి స్పీడ్‌ బ్రేకర్‌లే కారణం

మేదరమెట్ల, అక్టోబరు 26: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొనడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మి గిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటప డ్డారు. ఈ సంఘటన కొరిశపాడు మండలం వెం కటాపురం వద్ద మంగళవారం వేకువజామున చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు.. హైదరా బాద్‌ నుంచి కందుకూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావె ల్స్‌ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అది వెంకటాపురం వద్దకు చేరుకునే సరికి ముందు వైపు మొక్కల లోడుతో కేరళకు వెళ్తున్న లారీ వేగా న్ని డ్రైవర్‌ ఒక్కసారిగా తగ్గించాడు. అక్కడ  అత్య వసర రన్‌వే కోసం జాతీయ రహదారిపై నిర్మించిన స్పీడు బ్రేకర్లను ఆయన దగ్గరకు వచ్చే వరకూ గు ర్తించక ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో వేగంగా వ స్తున్న బస్సు.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారి లో బస్సు డ్రైవర్‌ విద్యాసాగర్‌, కందుకూరు కు చెందిన గుంతోటి సాగర్‌, నెల్లూరుకు చెం దిన సయ్యద్‌ నయీమ్‌, మర్రిపూడి మం డలం ధర్మవరంనకు చెందిన శంఖవరపు సుజాత, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూ రు మండలానికి చెందిన శానం సాయిగణే ష్‌, శింగరాయకొండకు చెందిన దొడ్డా సులో చన, టంగుటూరు మండలం కందులూరు కు చెందిన బత్తుల హరిబాబు, ఉప్పలపాటి వినోద్‌కుమార్‌, శైలజ, కిరణ్‌, రాధ, మాధవ, తన్నీరు ఏసుబాబు ఉన్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ కట్టా అనూక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైవే అంబులెన్స్‌లు, 108 సిబ్బంది స్వల్పగాయాలైన వారికి అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఒం గోలు వైద్యశాలకు తరలించారు. ఎక్కువ మందికి కా ళ్లూ, చేతులు, తలలకు బలమైన గాయాలయ్యాయి. కొంతమందికి కాళ్ల ఎముకలు విరగగడంతో బస్సులో నుంచి స్ర్టెచర్‌పై దించాల్సి వచ్చింది.  

స్పీడ్‌ బ్రేకర్ల తొలగింపు 

బస్సు ప్రమాదానికి కారణమైన స్పీడ్‌ బ్రేకర్లను మేదరమెట్ల ఎస్‌ఐ కట్టా అనూక్‌ ఆధ్వర్యంలో తొల గించారు. గత ఆరు నెలలుగా ఈ స్పీడ్‌ బ్రేకర్ల కార ణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ యువకుడు కూడా మృతి చెందాడు. ఎంతోమంది గాయపడ్డారు. ఎట్టకేలకు వాటిని ఇప్పుడు తొలగిం చారు. ఇక్కడ జిగ్‌ జాగ్‌ లైన్స్‌ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-27T05:10:26+05:30 IST