అభివృద్ధి పేరుతో చెట్లను కొట్టివేయటం అర్ధరహితం

ABN , First Publish Date - 2021-06-22T07:09:19+05:30 IST

అభివృద్ధి పేరుతో ప్రాణవాయువును అందించే తల్లిలాంటి చెట్ల ను కొట్టివేయటం అర్ధరహితం అని రిటైర్డ్‌ ఆర్‌జేడీ డాక్టర్‌ యు.దేవపాలన అన్నారు. పట్టణంలోని బంగ్లా రోడ్డు విస్తరణ కోసం పెద్ద పెద్ద చెట్లను నగర పంచాయతీ అధికారులు సిద్ధం అవుతున్నారన్న సమాచారంతో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు విగ్రహం వద్ద సోమవారం ఉదయం నిరసన కార్య క్ర మం నిర్వహించారు.

అభివృద్ధి పేరుతో చెట్లను కొట్టివేయటం అర్ధరహితం
బంగ్లా రోడ్డు లో చెట్ల తొలగింపు చేయరాదని నిరసన తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు

- రిటైర్డ్‌ ఆర్‌జేడీ దేవపాలన

అద్దంకి, జూన్‌ 21: అభివృద్ధి పేరుతో ప్రాణవాయువును అందించే తల్లిలాంటి చెట్ల ను కొట్టివేయటం అర్ధరహితం అని రిటైర్డ్‌ ఆర్‌జేడీ డాక్టర్‌  యు.దేవపాలన అన్నారు. పట్టణంలోని బంగ్లా రోడ్డు విస్తరణ కోసం పెద్ద పెద్ద చెట్లను నగర పంచాయతీ అధికారులు సిద్ధం అవుతున్నారన్న సమాచారంతో  అద్దంకి  పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు విగ్రహం వద్ద సోమవారం ఉదయం నిరసన కార్య క్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కావూరి రఘచంద్‌ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో కొద్దోగొప్పో పర్యావరణ హితంగా ఉన్న బంగ్లా రోడ్డులోని పచ్చని చెట్లను నరికి వేస్తూ  కాంక్రీట్‌ జంగిల్‌గా అధికారులు మారుస్తున్నారన్నారు. చెట్లను తొలగిస్తే అద్దంకి పూర్తి గా కాలుష్యం బారిన పడక తప్పదన్నారు. 12 సంవత్సరాల క్రితం నామ్‌ రోడ్డు విస్తరణ పేరుతో పెద్ద  చెట్లను తొలగించినా ఇంత వరకు సరిగ్గా మొక్కలు పెంచలేదని చెప్పారు. శింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం  చైర్మన్‌ జువ్వి రాము  మాట్లాడుతూ బంగ్లా రోడ్డులో ఉన్న చెట్లను తొలగించటానికి వీలు లేదని, అవసరమైతే నిరాహారదీక్ష చేస్తామన్నారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి  కమిటీ  అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, సీఐటీయూ జిల్లా  ఉపాధ్య క్షుడు గంగయ్య, పీసీసీ  సభ్యుడు కోరె సురేంద్రనాధ్‌, నాగయ్య, అంకం  నాగరాజు, అడుసుమల్లి కిషోర్‌బాబు, వైసీపీ నాయకులు పూనూరి నరేంద్ర, సురేంద్ర, చెన్నుపల్లి నాగేశ్వరరావు, మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T07:09:19+05:30 IST