50 శాతం తగ్గింపుతో వచ్చేసిన ట్రెండ్స్ షాపింగ్ ఫెస్టివల్

ABN , First Publish Date - 2022-06-26T00:12:53+05:30 IST

దేశంలోని అతిపెద్ద ఫ్యాషన్ రీటైలర్, ఆన్ ట్రెండ్, హై ఆన్ ఫ్యాషన్‌కు ప్రసిద్ధి చెందిన ట్రెండ్స్ (Trends) షాపింగ్

50 శాతం తగ్గింపుతో వచ్చేసిన ట్రెండ్స్ షాపింగ్ ఫెస్టివల్

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ఫ్యాషన్ రీటైలర్, ఆన్ ట్రెండ్, హై ఆన్ ఫ్యాషన్‌కు ప్రసిద్ధి చెందిన ట్రెండ్స్ (Trends) షాపింగ్ ఫెస్టివల్ మొదలైంది. ఈ ఫెస్టివల్‌లో మెన్స్‌‌వేర్, కిడ్స్‌వేర్, విమెన్స్ వేర్‌పై 50 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. దేశంలోనే ఇది అతిపెద్ద ఫ్యాషన్ సేల్ అని ట్రెండ్స్ తెలిపింది. కనీవినీ ఎరుగని తగ్గింపు ధరలు, తప్పనిసరి గిఫ్ట్‌లు, రివార్డులు, పాయింట్స్‌ లభించే ట్రెండ్స్‌లో షాపింగ్ చేయడం అసలైన మజా ఇస్తుందని ట్రెండ్స్  పేర్కొంది.   


దేశంలోని 850కిపైగా పట్టణాలలో 1500కుపైగా స్టోర్లు కలిగిన ట్రెండ్స్ అతి పెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ రీటెయిలర్‌గా రికార్డులకెక్కింది. ప్రతి వినియోగదారుడి అవసరాలు తీర్చేలా 20 సొంత బ్రాండ్లతోపాటు 100కుపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్‌ను అందిస్తోంది. 

Updated Date - 2022-06-26T00:12:53+05:30 IST