పరిపాలన వికేంద్రీకరణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-11-27T02:43:55+05:30 IST

పరిపాలన వికేంద్రీకరణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన అసెంబ్లీ, శాసనమండలిలో ప్రొసీడింగ్స్ కోర్టుకు అందించారా?

పరిపాలన వికేంద్రీకరణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన అసెంబ్లీ, శాసనమండలిలో ప్రొసీడింగ్స్ కోర్టుకు అందించారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆడియో, వీడియో క్లిప్స్ అందజేస్తున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. స్పీకర్ అందుబాటులో లేని కారణంగా బ్లూ బుక్స్ సమర్పించేందుకు న్యాయవాది సమయం కోరారు. 3 రాజధానుల అంశంపై చట్టం చేసేందుకు అసెంబ్లీకి అధికారం లేదని రైతుల తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు రిపీటెడ్ అంశాలపై కాకుండా కొత్త విషయాలను వాదనల రూపంలో తెలపాలని న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణ ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

Updated Date - 2020-11-27T02:43:55+05:30 IST