డిప్యూటీ ఈవోతో చర్చిస్తున్న ఏసీపీ శాంతకుమార్
సింహాచలం, మార్చి 27: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించేందుకు వస్తున్న నేపథ్యంలో ఏసీపీ శాంతకుమార్ తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ సింహగిరికి చేరుకున్న దగ్గర నుంచి అధికారులు ఆహ్వానం పలకడం, కప్పస్తంభ ఆలింగనం, బేడా మండప ప్రదక్షిణం, స్వామివారి దర్శనం, వేదాశీర్వచనాలు, తదితర అంశాలపై డిప్యూటీ ఈవో టి.అన్నపూర్ణతో కలిసి సమగ్రంగా క్షేత్రపరిశీలన చేశారు.