ముందుకు సాగని విచారణ!

ABN , First Publish Date - 2021-07-27T04:16:11+05:30 IST

జింకను చంపి విందు చేసుకున్న సంఘటనపై కేసు విచారణ ముందుకు సాగడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుకు సాగని విచారణ!

- జింక మాంసం విందు కేసుపై అనుమానాలు

అలంపూరు, జూలై 26 : జింకను చంపి విందు చేసుకున్న సంఘటనపై కేసు విచారణ ముందుకు సాగడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలం పూర్‌ మండలంలోని కోనేరు గ్రామపరిధిలోని ఆర్డీఎస్‌ కాలువ వద్ద వారంరోజుల క్రితం జింకను వేటాడి చంపి విందు చేసుకున్న సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో బలమైన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన అధికారులు, ఆ తర్వాత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసు, ఫారెస్టు అధికారుల మధ్య సమన్వయలోపంతో కేసు నీరుగారు తుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

మూడు గ్రామాల్లో అనుమానితులు

జింక విందు కేసులో మూడు గ్రామాలకు చెందిన కొందరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లింగనవాయి, కోనే రు, బుక్కాపురం గ్రామాలకు చెం దిన దాదాపు 15 మంది ఈ విందు చేసుకున్నట్లు మండ లంలో చర్చ కొనసాగుతోంది. ఈ కేసు నుంచి తప్పిం చుకునేందుకు సదరు అ నుమానితులు అధికార పార్టీ నాయకులను ఆశ్ర యించినట్లు తెలుస్తోంది. దీం తో వారు నయానా, భయానా అధికారులను లొంగదీసుకునేందు కు పావులుకదిపినట్లు సమాచారం. కానీ విషయం బయటకు పొక్కడంతో వారు కొంత వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించిన ఆర్డీఎస్‌ కాలువ సమీపంలో కీలకమైన ఆధారాలను సేకరించిన అధికారులు, నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది. 

రెండు రోజుల్లో చర్యలు

 కోనేరు గ్రామంలో గత  వారం జింకను వేటాడిన కేసులో అనుమానితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. కొన్ని అనివార్య కారణాల వల్ల బిజీగా ఉన్నాం. మండలానికి చెందిన ఎస్‌ఐ, త హసీల్దార్‌ పూర్తి సమాచారం అందించారు. ఈ కేసు విషయంలో ఎవరికీ తలొగ్గేది లేదు. రెం డు రోజుల్లో అనుమానితులపై కేసు నమోదు చేస్తాం. 

- నాగజ్యోతి, జిల్లా ఫారెస్టు అధికారి

Updated Date - 2021-07-27T04:16:11+05:30 IST