నేడు నర్సీపట్నంలో గిరిజన సంఘం బహిరంగ సభ

ABN , First Publish Date - 2022-05-27T06:37:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ గిరి జన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నర్సీప ట్నంలో బహిరంగ సభ జరగనుంది. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌, త్రిపుర మాజీ మంత్రి జితేంద్ర చౌదరి, జాతీయ చైర్మన్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

నేడు నర్సీపట్నంలో గిరిజన సంఘం బహిరంగ సభ
రోలుగుంట మండలం అర్ల గ్రామంలో మాట్లాడుతున్న సీఐటీయూ నాయకుడు చిరంజీవి

   ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ప్రతినిధి జితేంద్ర చౌదరి హాజరు

నర్సీపట్నం, మే 26 : ఆంధ్రప్రదేశ్‌ గిరి జన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నర్సీప ట్నంలో బహిరంగ సభ జరగనుంది. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌, త్రిపుర మాజీ మంత్రి జితేంద్ర చౌదరి, జాతీయ చైర్మన్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు  ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని, అటవీ హక్కు, ఉపాధి హామీ చట్ట సవరణను వ్యతిరేకించాలని, నర్సీపట్నంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాల్లో తాగు నీరు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్లతో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి  ఆహ్వానాలు పలికారు. 

‘మైదాన గిరిజన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి’

రోలుగుంట: మైదాన ప్రాంతాల్లోని గిరిజనులు నివశించే గ్రామాల్లో నేటికీ మౌలిక వసతులు లేక పోవడం దారుణమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి అన్నారు. అర్ల గ్రామంలో గురువారం ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడారు. రోలుగుంట మండలంలోని అర్ల, లోసింగి, గుర్రాలబైల, కొరుప్రోలు, చటర్జీపురం తదితర గిరిజన గ్రామాల్లో నేటికీ ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నట్టు చెప్పారు. ఎవరి కైనా అనారోగ్యం చేస్తే డోలీమోత తప్ప సరైన రహదారి సౌకర్యం లేదని వాపోయారు. పాల కులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పిం చాలని డిమాండ్‌ చేశారు.   శుక్రవారం నర్సీపట్నంలో జరగనున్న గిరిజన బహిరంగ సభను అంతా తరలి రావాలని కోరారు. మాజీ ఎంపీటీసీ కిముడు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:37:38+05:30 IST