రవ్వారిగూడెంలో భూదేవి పండుగ

ABN , First Publish Date - 2022-06-29T05:33:58+05:30 IST

ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు సరియం రామకృష్ణ, నడపాల సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రవ్వారిగూడెంలో భూదేవి పండుగ
భూదేవి పండుగలో సాంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజనులు

బుట్టాయగూడెం, జూన్‌ 28: ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు సరియం రామకృష్ణ, నడపాల సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం రవ్వారిగూడెంలో జరిగిన భూదేవి పండుగలో పాల్గొని ఆదివాసీలతో కలిసి రెలా రెలా పాటలతో గిరిజన నృత్యాలు చేశారు. ఆదివాసీల పండుగలు వర్ధిల్లాలి, సంస్కృతి, సాంప్రదాయాలను పాఠ్యంశాల్లో చేర్చాలని నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ పండుగలు కనుమరుగైపోతున్న తరుణంలో కొన్ని గ్రామాల ప్రజలు మాత్రమే ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. 1950 తర్వాత ఏజెన్సీకి వలస వచ్చిన గిరిజనేతరుల రేషన్‌, ఆధార్‌, ఓటర్‌ కార్డులను రద్దుచేసి మైదాన ప్రాంతాలకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో గిరిజనేతరుల జనాభా పెరుగుతున్నందున ప్రభుత్వాలు గిరిజన చట్టాలు, జి.వో.లు, హక్కులను రద్దుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 


Updated Date - 2022-06-29T05:33:58+05:30 IST