మహాత్మునికి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-10-03T06:05:13+05:30 IST

భారతదేశ చరిత్రలో మహాత్మగాంధీ స్థానం సుస్థిరమని ఎమ్మెల్యే అన్నా.రాంబాబు అన్నారు.

మహాత్మునికి ఘన నివాళి
గాంధీ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

జాతిపితకు పూలమాలల వేసిన ఎమ్మెల్యేలు

పలు చోట్ల సేవా కార్యక్రమాలు 

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 2 : భారతదేశ చరిత్రలో మహాత్మగాంధీ స్థానం సుస్థిరమని ఎమ్మెల్యే అన్నా.రాంబాబు అన్నారు. గాంధీ జయంతి సందర్భం గా ఆదివారం పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింస మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా పోరాడి బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టి దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించాడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య, కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌, మానం బాలిరెడ్డి, పెద్దభాషా, దమ్మాల జనార్థన్‌, షేక్‌ మస్తాన్‌వలి,  డాక్టర్‌ భూమానరసింహారెడ్డి, డాక్టర్‌ జీకే.మోహన్‌రెడ్డి, పెండేల కిరణ్‌, దేమా శ్రీరాములు పాల్గొన్నారు.

బలిజ సంఘం ఆధ్వర్యంలో నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యగటీల రంగసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి పుసుపులేటి శ్రీను,  యగటీల రవిప్రకాశ్‌, ముద్దర్ల శ్రీను పాల్గొన్నారు.

అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్‌, విజయరామరాజు, రాజు, శివమణి, బాదుల్లా, భరత్‌, కమతం రమేష్‌ పాల్గొన్నారు. కంచుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలోనలుగురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటరాజమ్మ, కార్యదర్శి జమాల్‌, పాల్గొన్నారు. 

యశ్వంత్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు, రొట్టేలు పంపిణీ చేశారు. మొర్రి తిరుపతమ్మ, యశ్వంత్‌ సుమన్‌, తదితరులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం :  త్రిపురాంతకంలోని వాసవీకన్యకా పరమేశ్వరీ అమ్మవారిశాలలోని మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం మండల ప్రతినిధులు కాసుల సత్యనారాయణ, సీహెచ్‌.హనుమంతరావు, జి.చిన్నసుబ్బారావు, కె.ప్రసాద్‌, పి.మల్లిఖార్జునరావు, కె.పూర్ణనాగేశ్వరరావు పాల్గొన్నారు. తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్‌ వలరాజు ఆద్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : దేశంకోసం ప్రాణాలు లెక్కచేయకుండా తెల్లదొరలపై పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ మహాత్మాగాంధీ అని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అన్నారు. గాంధీజయంతి పురస్కరించుకొని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌, మున్సిపల్‌ కమీషనర్‌ గిరికుమార్‌, డిఈ సుభానీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాయబ్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు. 

బేస్తవారపేట(కంభం) : కంభం లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఆదివారం స్థానిక ఎల్‌ఐసీ సేవాకేంద్రం వద్ద మహత్మగాంధీ, లాల్‌బహుదూర్‌శాస్ర్తిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళులు అర్పించా రు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌  పులి శ్రీనివాసప్రసాద్‌,మొగల్‌ మహబుబ్‌ బేగ్‌,ఎన్‌.కేశవ, సీహెచ్‌.గంగాధర్‌,జె.తులసి ప్రసాద్‌,వి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

రాచర్ల : మండలంలోని చినగానిపల్లె గ్రామంలో జడ్పీటీసీ సభ్యురాలు పగడాల దేవి, పగడాల శ్రీరంగంలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సచివాలయంలో సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌ నివాళులు అర్పించారు.

పెద్ద దోర్నాల : పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మా పద్మజ, సర్పంచి చిత్తూరి హారిక, గ్రామ కార్యదర్శి గాంధీజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో నటరాజ్‌ కూడలిలో ఉన్న గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మ గాంధీజి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ యా కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు కిరణ్‌ కిశోర్‌కుమార్‌, టీడీపీ నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ సమ్మద్‌భాష, యలకపాటి చంచయ్య, కే.చెన్నారెడ్డి, కే.శ్రీనివాస్‌యాదవ్‌, షేక్‌ మౌలాలి, వైసీపీ నాయకులు జోగి వెంకట నారాయణ, కె శ్రీనివాసులు పాల్గొన్నారు.

తర్లుపాడు : జిల్లా పరిషత్‌ పాఠశాలలోని గాంధీ విగ్రహానికి నెహ్రూ యూత్‌, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మీ మాట్లాడుతూ..,ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ ఆశయాలను కొనసాగించాలన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కశ్శెట్టి జగన్‌బాబు, నెహ్రూ యూత్‌ అధ్యక్షు డు బి.పుల్లయ్య, వాసవీ క్లబ్‌ సభ్యులు కె.రంగరత్నమ్మ, కృష్ణవేణి, జి.జనార్ధన్‌, ఎస్‌.రామసుబ్బారెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ అక్బర్‌వలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T06:05:13+05:30 IST