సుందరయ్యకు నివాళి

ABN , First Publish Date - 2022-05-20T05:12:32+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం పట్ణణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో గురువారం సీపీఎం, సీఐటీయూ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్దంతిని నిర్వహించారు.

సుందరయ్యకు నివాళి
రాజుపాళెంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం, మే 19 : బుచ్చిరెడ్డిపాళెం పట్ణణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో గురువారం సీపీఎం, సీఐటీయూ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్దంతిని నిర్వహించారు.   పట్టణంలోని ఆటో స్టాండ్‌, వవ్వేరు బ్యాంకు, జొన్నవాడ సెంటర్‌, దామరమడుగు, పెనుబల్లి, శ్రీరంగరాజపురం, రేబాల గ్రామాల్లో సుందరయ్య చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు.  కార్యక్రమంలో నాయకులు ముత్యాల గుర్నాథం, జొన్నలగడ్డ వెంకమరాజు,  జానీ బాషా, మల్లికార్జున, మునీర్‌ అహ్మద్‌, శ్రీనివాసులు, ఆటో, ముఠా, వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కొడవలూరు : పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలే ఊపిరి గా పోరాడిన మహ్నోతుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు  అందరూ కృషి  చేద్దామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు  గోని దయకర్‌ అన్నారు. మండలంలో నార్తురాజుపాలెం గ్రామ ప్రధాన కూడలి వద్ద దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి 37వవర్ధంతిని పురస్కరించుకొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంబించారు. తొలుత   గోని దయాకర్‌, సీపీఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు భూలోకం కాంతరావు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

 మనుబోలు : మండలంలోని చెర్లోపల్లి, మడమనూరు, కాగితాలపూరు గ్రామాల్లో గురువారం సీపీఎం జాతీయ నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి తలారి దేవదానం, నాయకులు  భాస్కర్‌, జోగి శివయ్య, యశ్వంత్‌, ఉదయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:12:32+05:30 IST