ఉత్తమ వైద్య సేవకు సత్కారం

ABN , First Publish Date - 2021-06-22T07:05:53+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ ప్రారంభం నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) చైర్మన్‌ రాయపు రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

ఉత్తమ వైద్య సేవకు సత్కారం
మాట్లాడుతున్న డాక్టర్‌ రాయపు రమేష్‌బాబు

పేర్లు నమోదు చేసుకోవాలంటూ డాక్టర్లకు ఐఎంఏ నేతల సూచన 


 తిరుపతి(తిలక్‌రోడ్డు), జూన్‌ 21: జిల్లాలో కొవిడ్‌ ప్రారంభం నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు తమ పేర్లను నమోదు  చేసుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) చైర్మన్‌ రాయపు రమేష్‌బాబు పిలుపునిచ్చారు. జూలై 1న తిరుపతిలో అల్యూమిని అసోసియేషన్‌, ఐఎంఏ సంయుక్తంగా నిర్వహించే డాక్టర్స్‌ డే కార్యక్రమంలో వీరిని సత్కరించనున్నట్లు చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఐఎంఏ సభ్యులైన ప్రభుత్వ, ప్రవేట్‌ వైద్యులు ఈనెల 28వ తేదిలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98481 54174, 99669 12700 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈసమావేశంలో కోశాధికారి డాక్టర్‌ కిరీటి, కార్యదర్శి జీవన్‌బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T07:05:53+05:30 IST