ముగ్గురి ప్రాణాలు రక్షించిన రైతుకు సన్మానం

ABN , First Publish Date - 2022-05-22T06:35:51+05:30 IST

మండలంలోని వానవోలు గ్రామానికి చెం దిన రైతు రంగనాథ్‌ సమయోచితంగా ప్రవర్తించి ముగ్గురి నిండు ప్రాణాలు కాపాడారు. దీంతో ఆయన్ను శనివారం పోలీ్‌సస్టేషనకు పిలిపించి సీఐ సుబ్బరాయుడు శాలువా పూలమాలలతో సత్కరిం చి అభినందించారు.

ముగ్గురి ప్రాణాలు రక్షించిన రైతుకు సన్మానం
రైతు రంగనాథ్‌ను సన్మానిస్తున్న సీఐ సుబ్బరాయుడు

గోరంట్ల, మే 21: మండలంలోని వానవోలు గ్రామానికి చెం దిన రైతు రంగనాథ్‌ సమయోచితంగా ప్రవర్తించి ముగ్గురి నిండు ప్రాణాలు కాపాడారు. దీంతో ఆయన్ను శనివారం పోలీ్‌సస్టేషనకు పిలిపించి సీఐ సుబ్బరాయుడు శాలువా పూలమాలలతో సత్కరిం చి అభినందించారు. చిమత్తూరు మండలం బందేపల్లికి చెందిన శ్రీనాథ్‌, గౌతమి దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరికి నాలుగే ళ్లు, మరొకరికి  పదినెలల వయసు ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తున్న ఈ కుటుంబంలో చిన్న చిన్న మనస్ఫర్థలతో భార్య తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిం ది. గౌతమి పుట్టినిల్లు కర్ణాటకలోని గౌరీబిదునూరు వద్ద ఉన్న సా తర్లపల్లి. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్తానని కు టుంబ సభ్యులకు తెలిపింది. ఈక్రమంలో జీవితంపై విరక్తితో స్వ గ్రామానికి వెళ్లకుండా, గోరంట్ల మండలం వానవోలు గ్రామ సమీపంలోని రంగనాథస్వామి ఆలయానికి ఆటోలో వెళ్లినట్లు పోలీసు లు తెలిపారు. ఆలయంలో పూజలు జరిపి అక్కడే ఉన్న కోనేరులో   దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. అదే సమయంలో పక్కనే తన పొలానికి నీరు కడుతున్న రైతు రంగనాథ్‌ పరిస్థితి గ మనించి ఆమెను అడ్డుకున్నాడు. వెంటనే గోరంట్ల పోలీ్‌సస్టేషనకు సమాచారం అందించారు. సీఐ సుబ్బరాయుడు స్పందిస్తూ ఏఎస్‌ ఐ మద్దిలేటి, మహిళా పోలీసు అనూషలను సంఘటనా స్థలానికి పంపారు. తల్లి, పిల్లలను శుక్రవారం సాయంత్రం గోరంట్ల స్టేషనకు తీసుకొచ్చారు. పోలీస్‌ స్టేషనలో కౌన్సెలింగ్‌ ఇచ్చి, బంధువులకు వారిని అప్పగించారు.

             

  ప్రాణాలు కాపాడిన రైతు రంగనాథ్‌ను స్టేషనకు రప్పించి సన్మానించారు. నగదు బహుమతి అందజేశా రు. మండలంలో ఎలాంటి నేర సమాచారం తెలిసినా, అనుమానాస్పద స్థితిలో కొత్త వ్యక్తులు మీ ప్రాంతంలో సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ ప్రజల ను కోరారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ మద్దిలేటి, మహిళా పోలీసు అనూష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:35:51+05:30 IST