ఎమర్జెన్సీపై పోరాడిన వారికి సన్మానం

ABN , First Publish Date - 2022-06-26T04:00:11+05:30 IST

దేశ చరిత్రలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధిం చిన ఎమర్జెన్సీ దురదృష్టకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జిల్లాకు చెందిన రేవెల్లి రాజలింగు, కందుల పెద్దన్న, దామెర రాజయ్య, మల్రాజు రఘునాధ్‌రావులను శనివారం బీజేపీ కార్యాలయంలో సన్మానించారు.

ఎమర్జెన్సీపై పోరాడిన వారికి సన్మానం
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

ఏసీసీ, జూన్‌ 25: దేశ చరిత్రలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధిం చిన ఎమర్జెన్సీ దురదృష్టకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జిల్లాకు చెందిన రేవెల్లి రాజలింగు, కందుల పెద్దన్న, దామెర రాజయ్య, మల్రాజు రఘునాధ్‌రావులను శనివారం బీజేపీ కార్యాలయంలో సన్మానించారు. రఘునాధ్‌ మాట్లాడుతూ  ఇందిరాగాంధీ 1975 జూన్‌ 25న జాతీయ అత్యవసర పరిస్థితి విధించిందని తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి దినమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని అక్రమంగా బంధించారన్నారు. నాయకులు మున్నారాజా, పురుషోత్తం, జైన్‌, బోయిని హరికృష్ణ, ప్రభాకర్‌, శ్రీదేవి, సతీష్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:00:11+05:30 IST