దామోదర నాయుడికి ప్రముఖుల నివాళులు

ABN , First Publish Date - 2021-01-24T05:22:35+05:30 IST

సెల్‌కాన్‌ మొబైల్‌ కంపెనీ, సెలెక్ట్‌ మొబైల్‌ స్టోర్స్‌ యాజమాని ఎర్రగుంట్ల గురుస్వామి నాయుడు,బీ న్యూ మొబైల్‌ స్టోర్స్‌ యజమాని బాలాజీ చౌదరి, చిత్తూరు సెల్‌టాన్‌ మొబైల్‌ స్టోర్‌ అధినేత మరియు జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణమ నాయుడు తండ్రి ఎర్రగుంట్ల దామోదరనాయుడికి శనివారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు

దామోదర నాయుడికి ప్రముఖుల నివాళులు
దామోదరనాయుడికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ దొరబాబు

గంగాధరనెల్లూరు, జనవరి 23: సెల్‌కాన్‌ మొబైల్‌ కంపెనీ, సెలెక్ట్‌ మొబైల్‌ స్టోర్స్‌ యాజమాని ఎర్రగుంట్ల గురుస్వామి నాయుడు,బీ న్యూ మొబైల్‌ స్టోర్స్‌ యజమాని బాలాజీ చౌదరి, చిత్తూరు సెల్‌టాన్‌ మొబైల్‌ స్టోర్‌ అధినేత మరియు జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణమ నాయుడు తండ్రి ఎర్రగుంట్ల దామోదరనాయుడికి శనివారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.అనారోగ్యంతో  శుక్రవారం సాయంత్రం మరణించిన దామోదర నాయుడికి (93)   శనివారం మధ్యాహ్నం 3గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.అంతకుముందు ఆయన   స్వగ్రామమైన గంగాధరనెల్లూరు మండలం పాతపాళ్యం పంచాయతీ మిట్టకొత్తూరులో దామోదర నాయుడి పార్థివ దేహాన్ని శనివారం ఎమ్మెల్సీ దొరబాబు,తెలుగురైతు  నాయకుడు పాచిగుంట మనోహర నాయుడు, జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆనగంటి హరికృష్ణ, చిత్తూరు పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు అరుణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు మోహన్‌ నాయుడు,శ్రీధర్‌యాదవ్‌, హరిబాబు నాయుడు, రుద్రయ్య నాయుడు, భీమినేని చిట్టిబాబు, సుధాకర రెడ్డి, , దేవసుందరం, రుద్రప్పనాయుడు, దేవరాజులు, కామసాని కోదండరెడ్డి, జగన్నాదరెడ్డి,   బెల్లంకొండ అఽశోక్‌నాయుడు,ప్రకాష్‌నాయుడు, స్వామిదాస్‌, నారాయణరెడ్డి, బాలచంద్రారెడ్డి,  నరసింహులు నాయుడు, చిత్తూరు మహేంద్రాట్రాక్టర్‌ షోరూమ్‌ అధినేత మునివర్ధన నాయుడు,  తులసిరెడ్డి, మునిరత్నం నాయుడు, వెంకటేష్‌ యాదవ్‌, పదకుమార్‌, ప్రకాష్‌, వైసీపీ నాయకులు గుణశేఖర్‌ మొదలి, బాబునాయుడు,బలరామిరెడ్డి, శంకర్‌మొదలి, కాళేపల్లె గోపాల్‌రెడ్డి,బీజేపీ నేతలు మణివర్మ, సుందరరాజ్‌, జీవరత్నంరెడ్డి, మురళి తదితరులు  దామోదర నాయుడికి నివాళులర్పించి ఆయన కుమారులను ,అల్లుడైన చిత్తూరులోని బాలాజి వాచ్‌ అండ్‌ మొబైల్స్‌ షాపు  యాజమాని యంప్రాల వెంకటేశులు నాయుడిని పరామర్శించారు.

Updated Date - 2021-01-24T05:22:35+05:30 IST