త్రివర్ణ రుచులు

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

ఈ రోజుల్లో ప్రతిదీ సెలబ్రేషన్‌. అందుకే రొటీన్‌గా చేసుకునే ఆహారానికి కాస్త పాజ్‌ ఇచ్చేయండి. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకి సరికొత్తగా ఫుడ్‌ చేయటానికి ప్రయత్నించండి. తిరంగ థీమ్‌తో తయారు చేసిన ఫ్రైడ్‌ రైస్‌, మోతీ మష్రూమ్‌, పాలక్‌ హల్వాతో పాటు మరికొన్ని నాన్‌వెజ్‌ ప్లాటర్స్‌ను మీరు తయారు చేసుకోవచ్చిలా...

త్రివర్ణ రుచులు

ఈ రోజుల్లో ప్రతిదీ సెలబ్రేషన్‌. అందుకే రొటీన్‌గా చేసుకునే ఆహారానికి కాస్త పాజ్‌ ఇచ్చేయండి. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకి సరికొత్తగా ఫుడ్‌ చేయటానికి ప్రయత్నించండి. తిరంగ థీమ్‌తో తయారు చేసిన ఫ్రైడ్‌ రైస్‌, మోతీ మష్రూమ్‌, పాలక్‌ హల్వాతో పాటు మరికొన్ని నాన్‌వెజ్‌ ప్లాటర్స్‌ను మీరు తయారు చేసుకోవచ్చిలా...


తిరంగా ఫ్రైడ్‌ రైస్‌

సెజ్‌వన్‌ చికెన్‌ ఫ్రైడ్‌ రెస్‌

కావాల్సిన పదార్థాలు

చికెన్‌ బోన్‌లెస్‌- 60 గ్రాములు, బాస్మతి రైస్‌-200 గ్రాములు, వైట్‌ పెప్పర్‌, ఉప్పు- రుచికి తగినంత, నూనె- కొద్దిగా, సెజ్‌వన్‌ సాస్‌- కొద్దిగా 

తయారీ విధానం

ముందుగా బాస్మతి అన్నం వండిపెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేసి వేడయ్యాక చికెన్‌ వేయాలి. సగం ఉడికేంత వరకూ కుక్‌ చేయాలి. ఆ తర్వాత సెజ్‌వన్‌ సాస్‌ వేయాలి. ఆ తర్వాత 75 శాతం దాకా ఉడికించాలి. ఆ తర్వాత బాస్మతి రైస్‌ వేయాలి. గరిటెతో బాగా మిశ్రమం కలపాలి. సెజ్‌వన్‌ చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌ను ప్లేట్‌లోని చివరిభాగంలో ఉంచాలి. 


ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు- 2, బాస్మతి రైస్‌-200 గ్రామలు,వైట్‌ పెప్పర్‌, ఉప్పు-రుచికి తగినంత, నూనె- కొద్దిగా 

తయారీ విధానం: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక కోడిగుడ్ల సొన పోయాలి. గరిటెతో బాగా తిప్పాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యంతో చేసిన అన్నం వేయాలి. వైట్‌ పెప్పర్‌, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేయాలి ఆ తర్వాత ప్లేట్‌లో మరికాస్త రైస్‌ పట్టేంత స్థలం ఉంచి.. సెలంట్రో చికెన్‌ రైస్‌ పక్కన ఉంచాలి. 





సురేష్‌ కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌, ప్లాట్‌ఫామ్‌ 65 హైదరాబాద్‌


సెలంట్రో చికెన్‌ రైస్‌

కావాల్సిన పదార్థాలు

పాలకూర  పేస్ట్‌-20 గ్రాములు, జీడిపప్పు- 5 పలుకులు, చికెన్‌ బోన్‌లెస్‌- 6 గ్రాములు,  బాస్మతి బియ్యం-200 గ్రాములు, ఉప్పు-రుచికి తగినంత, నూనె- కొద్దిగా  


తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యంతో అన్నం చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులోకి చికెన్‌ వేయాలి. సగం ఉడికిన తర్వాత పాలకూర పేస్ట్‌ వేయాలి. ఆ తర్వాత చికెన్‌ను 75 శాతం వరకూ ఉడికించాలి.  ఆ తర్వాత అందులోకి బాస్మతి అన్నం వేసి జీడిపప్పు పలుకులు వేయాలి. బాగా కలియదిప్పి.. ఆ తర్వాత సెలంబ్రో చికెన్‌ రైస్‌ను ప్లేట్‌లో మిగతా రైస్‌ కూడా పట్టేట్లు పైన జాగ్రత్తగా సర్దాలి.


మోతీ మష్రూమ్‌

కావాల్సిన పదార్థాలు

మష్రూమ్‌- 200 గ్రాములు, చీజ్‌-50 గ్రాములు, ఉప్పు- రుచికి తగినంత, పెరుగు- కప్పు, ఇలాచి-టేబుల్‌ స్పూన్‌, చక్కెర- టేబుల్‌ స్పూన్‌, పన్నీర్‌-15 గ్రాములు, పచ్చిమిర్చి పేస్ట్‌-టేబుల్‌ స్పూన్‌, క్రీమ్‌-2 టేబుల్‌ స్పూన్లు 


తయారీ విధానం

ముందుగా మష్రూమ్స్‌ను తీసుకోవాలి. మష్రూమ్‌ స్టఫ్‌కోసం స్టఫ్‌కోసం గిన్నెలో పన్నీర్‌, చీజ్‌, ఇలాచి పొడి, చక్కెర, ఉప్పు వేసి బాగా మిశ్రమంగా కలపాలి. వైట్‌ మసాలా కోసం- పెరుగు, క్రీమ్‌, ఉప్పు, ఇలాచి వేయాలి. మష్రూమ్‌ మధ్యభాగంలో స్టఫ్‌ చేయాలి. పెరుగుతో చేసిన మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత మష్రూమ్స్‌ ముఖాలు ఎదురెదురుగా ఉండేట్లు తందూరి కడ్డీకి గుచ్చాలి. తందూరి ఓవెన్‌లో 15 నిమిషాల పాటు కుక్‌ చేయాలి. దీనికి కొత్తిమీరతో గార్నిష్‌ చేసి పుదీన చట్నీతో తినాలి. 




గ్రిల్‌ లైన్‌ చికెన్‌ 

కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్‌ చికెన్‌-100 గ్రాములు, స్ర్పింగ్‌ ఆనియన్‌, పాలకూర, కొత్తిమీర పేస్ట్‌-30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి పేస్ట్‌- 30గ్రాములు, ఉప్పు-తగినంత, నూనె- కొద్దిగా 

తయారీ విధానం

పాన్‌లోకి కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి వేయించాలి. ఆనియన్స్‌, పాలకూర, కొత్తిమీర పేస్ట్‌ వేసి కలియబెట్టాలి. రుచికి సరిపడ ఉప్పు వేయాలి. బాగా కుక్‌ చేశాక బోన్‌లెస్‌ చికెన్‌ వేసి కుక్‌ చేయాలి. దాన్ని ఒక ప్లేట్‌లో ఉంచాలి.


 బటర్‌ గార్లిక్‌ ఫిష్‌

కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్‌ చేప- 100 గ్రాములు, వెల్లుల్లి-20 గ్రాములు, పసుపు పచ్చని క్యాప్సికమ్‌-20 గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- 20 గ్రాములు, వెన్న-15 గ్రాములు, ఉప్పు-రుచికి సరిపడ

తయారీ విధానం

పాన్‌లోకి నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌ను వేయించాలి. అందులోకి చేప ముక్కలు వేసి కుక్‌ చేయాలి. చివరగా ఉప్పు, బటర్‌ వేసి బాగా కుక్‌ చేయాలి.   


హునాన్‌ మటన్‌

కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్‌ మటన్‌-200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 20 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు- 20 గ్రాములు, క్యాప్సికమ్‌- 20 గ్రాములు, ఎండిన మిరపకాయలు- 10 గ్రాములు, ఓస్టర్‌ సాస్‌-15 ఎమ్‌.ఎల్‌, చిల్లి సాస్‌-10 ఎమ్‌.ఎల్‌, టొమాటో సాస్‌-5 ఎమ్‌.ఎల్‌, ఉప్పు- రుచికి తగినంత

తయారీ విధానం 

పాన్‌లోకి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, మటన్‌ వేసి కొద్ది సేపు కుక్‌ చేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్‌, మిరపకాయలు, సాస్‌లు వేయాలి. బాగా వండిన తర్వాత ప్లేట్‌లో వేసుకోవాలి. 


Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST