Tripura BJP : త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ రాజీనామా

ABN , First Publish Date - 2022-05-14T22:01:03+05:30 IST

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి

Tripura BJP :  త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ రాజీనామా

న్యూఢిల్లీ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్‌ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. ఆయన ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారు. 


నూతన ముఖ్యమంత్రిని బీజేపీ శాసన సభా పక్ష  సమావేశంలో ఎన్నుకుంటారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే హాజరవుతారని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.


రాజీనామా చేసిన తర్వాత బిప్లబ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతిదానికీ ఓ నిర్ణీత కాలం ఉంటుందని చెప్పారు. తాము ఆ నిర్ణీత కాలాన్నిబట్టి పని చేస్తామన్నారు. తనకు ఏ పదవిని  అప్పగించినా తాను అందులో ఇమిడిపోతానని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయినా, వేరొకటి అయినా తాను అందుకు తగినట్లుగా వ్యవహరిస్తానన్నారు. 


రెండు రోజుల క్రితం జేపీ నడ్డా (JP Nadda)తో కలిసిన అనంతరం బిప్లబ్ ఇచ్చిన ట్వీట్‌లో, తాము బీజేపీ సంస్థాగత అంశాలపై చర్చించినట్లు తెలిపారు. త్రిపుర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తాను వివరించానని చెప్పారు. 


ఈ నెల 13న అమిత్ షా (Amit Shah)తో భేటీ అనంతరం బిప్లబ్ ఇచ్చిన ట్వీట్‌లో, కూడా పార్టీ సంస్థాగత అంశాలపై లోతుగా చర్చించామని, తన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించానని చెప్పారు. 


Read more