Advertisement

రాజేందర్ మౌనం: త్రిష-శింబు పెళ్లి నిజమేనా?

Oct 16 2020 @ 10:57AM

కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ శింబు, ప్రముఖ హీరోయిన్ త్రిష ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవల తమిళ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది. 


ఈ వార్తలపై అటు, త్రిష ఇటు శింబు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల విషయమై శింబు తండ్రి టి.రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా శింబు, త్రిష పెళ్లి గురించి రాజేందర్‌ను ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాజేందర్ సమాధానం చెప్పలేదు. పెళ్లి వార్తను ఖండించకుండా రాజేందర్ ఆ ప్రశ్నను దాటవేయడం సంచలనంగా మారింది. దీంతో కోలీవుడ్ మీడియాలో మళ్లీ త్రిష-శింబు పెళ్లి వార్తలు మొదలయ్యాయి. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.