‘‘మన మనసులో (హృదయంపై) త్రిశూల్ ఉన్నప్పుడు... నాలుక మీద ‘ఓం నమఃశివాయ’ మంత్రం పలుకుతుంది’’ అని నటి పూనమ్ కౌర్ అంటున్నారు. తాజాగా హృదయంపై త్రిశూల్ టాటూ వేయించుకున్నారామె. ఆ టాటూలను చూపిస్తూ తీసుకున్న సెల్ఫీలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారామె. శ్రుతీ హాసన్, సమంత, రష్మిక, ఛార్మీ కౌర్, తాప్సీ, అనసూయ, రోజా, నాగచైతన్య తదితరులు ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకున్నవారే. వాళ్లలో చాలామంది టాటూల్లో పేరు లేదంటే ఏదొక మంచి మాటో, బొమ్మో కనిపిస్తుంది. పూనమ్ కౌర్కి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. అందుకని, త్రిశూలాన్ని పచ్చబొట్టుగా పొడిపించు కున్నారు.