Advertisement

‘శ్రీకారం’ టీజర్‌ డైలాగ్‌ సూపర్బ్‌గా ఉంది: త్రివిక్రమ్‌

Feb 26 2021 @ 21:46PM

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోహీరోయిన్లుగా.. 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శ్రీకారం'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ మంచి స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే. యువ సంగీత కెరటం మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చారు. కాగా, ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ విడుదల చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ ఈ సాంగ్‌ను లాంచ్‌ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.

 

సాంగ్‌ విడుదల అనంతరం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ''14 రీల్స్ రామ్, గోపీగారు నాకెంతో ఇష్టమైన ప్రొడ్యూసర్స్. వాళ్లు దూకుడికి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో చాప్టర్ స్టార్ట్ చేసి దానికి శ్రీకారం చుడుతున్నారు. మా రాంజో బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలోని మూడు పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ఆల్ రెడీ సోషల్ మీడియాలో విపరీతంగా సక్సెస్ అయ్యాయి. శ్రీకారం టైటిల్ సాంగ్ 4వ పాట నా చేతులమీదుగా లాంచ్ అవడం హ్యాపీగా ఉంది. టీజర్ చూశాను.. నాకు బాగా నచ్చింది. స్టోరీ విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళు నెత్తిమీద జుట్టంత ఉంటే దానిని పండించేవాళ్ళు మూతి మీద మీసం అంత మంది ఉన్నారు. ఆ డైలాగ్ సూపర్బ్‌గా ఉంది. ఈ చిత్రానికి శ్రీకారం అనేది పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్. నాకు తెలిసి నెక్ట్స్‌ ప్రపంచానికి బిగ్ థింగ్ వ్యవసాయం. వ్యవసాయం ఎంతో పాతది అయినా దానిమీద ఆధారపడి కొన్నివేల సంవత్సరాల నుండి బ్రతుకుతున్నాం. జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాంటప్పుడు వ్యవసాయం లాభసాటిగా మారాలి. కానీ నష్టాల్లో కూరుకుపోతుంది. దానికి సొల్యూషన్ చెప్పడానికి దర్శకుడు కిషోర్  శ్రీకారం ద్వారా ప్రయత్నం చేశాడు. ఒక పాత పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు. 'అఆ'కు  మ్యూజిక్ చేసిన మిక్కీ ఈ చిత్రానికి కూడా వండర్‌ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు.." అన్నారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.