తండాలో నీటి కోసం తంటాలు

ABN , First Publish Date - 2021-04-24T05:04:21+05:30 IST

చెంతనే కృష్ణానది నీరు పారుతున్నా నేటికీ తండాలలో నీటి కోసం తంటాలు తప్పడం లేదు.

తండాలో నీటి కోసం తంటాలు
గేమ్యానాయక్‌తండాలో తాగునీటి కోసం తంటాలు పడుతున్న గిరిజనులు

- ఇంటికో బిందె నీళ్లు వస్తున్నాయి

- రెండు రోజుల నుంచి గేమ్యానాయక్‌తండాలో కరెంట్‌ కట్‌

- కరోనా కాలంలో కష్టాలు పడుతున్నాం

- ‘ఆంధ్రజ్యోతి’తో మొరపెట్టుకున్న గిరిజనులు


కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 23: చెంతనే కృష్ణానది నీరు పారుతున్నా నేటికీ తండాలలో నీటి కోసం తంటాలు తప్పడం లేదు. కొల్లాపూర్‌ మండల పరిఽధిలోని ముక్కి డిగుండం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గేమ్యానా యక్‌తండాలో వేసవికాలం ప్రారంభం నుంచే మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటికో బిందె నీళ్లు మాత్రమే వస్తున్నాయని, నీటి కోసం బోరుబావులు, బోర్ల వద్దకు వెళ్లడం తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ప్రభుత్వం మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి సరిపడా నీళ్లందిస్తామని చెబుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో మిషన్‌ భగీరథ నీళ్లు  గిరిజనుల దరి చేరడం లేదు. మిషన్‌ భగీరథ ప్రతీ రో జు ఇంటికి బిందెకు ఎక్కువ రావని ఎన్నిసార్లు చెప్పి నా అధికారులు స్పందించడం లేదని గిరిజనులు ‘ఆంధ్రజ్యోతి’తో మొరపెట్టుకున్నారు. రెండు రోజుల నుంచి గేమ్యానాయక్‌తండాలో విద్యుత్‌ సరఫరా లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కా లేదన్నారు. కరోనా కాలంలో నీటి కోసం ఒకే దగ్గర గు మిగూడి కష్టాలు పడుతున్నామని ‘ఆంధ్రజ్యోతి’తో గో డు వెలిబుచ్చుకున్నారు. వెంటనే తమ తండాలో నెల కొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని, వేసవిలో తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజన మహిళలు కోరు తున్నారు. 

  



Updated Date - 2021-04-24T05:04:21+05:30 IST