ప్రజల మధ్యనే ఉండి పని చేస్తా..

ABN , First Publish Date - 2021-05-10T05:59:18+05:30 IST

ప్రజల మధ్యనే ఉండి పని చేస్తా..

ప్రజల మధ్యనే ఉండి పని చేస్తా..

-మాజీ కార్పొరేటర్‌ కల్పన సింగ్‌లాల్‌

-టీఆర్‌ఎస్‌ నుంచి పలువురి సస్పెన్షన్‌ 

వరంగల్‌ అర్బన్‌క్రైం, మే 9 : కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి చెందినా ప్రజల కష్టనష్టాలను తెలుసుకుని పనిచేస్తామని ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను తీర్చుతామని 2వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ బానోతు కల్పన సింగ్‌లాల్‌ అన్నారు. ఆదివారం వంగపహాడ్‌ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని, డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. అబద్ధపు హామీలతో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇప్పటి వరకు డివిజన్‌లో కనీసం పర్యటించిన సందర్భం లేద న్నారు. డివిజన్‌ అధ్యక్షుడు గండు అశోక్‌ యాదవ్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో కొందరు పార్టీలోనే ఉండి టీఆర్‌ఎస్‌ను మోసం చేశారని ఆరోపించారు. వారిని గుర్తించి ఎన్నికల ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు ఆదేశాల మేరకు వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్టు పేర్కొన్నారు. డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్‌, ఈర్యానాయక్‌, మాజీ సర్పంచ్‌ రాజేందర్‌ యాదవ్‌ను పార్టీ నుంచి  తొలగిస్తున్నట్టు అశోక్‌ వెల్లడించారు. పర్వతగిరి జడ్పీటీసీ సభ్యులు బానోతు సింగ్‌లాల్‌, ఉపాధ్యక్షుడు జంగకుమార్‌ యాదవ్‌, గ్రామశాఖ అధ్యక్షుడు మంద భాస్కర్‌, డివిజన్‌ యూత్‌ అధ్యక్షుడు శ్యాంకుమార్‌, మైనార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రజియాజోయ, డివిజన్‌ యూత్‌ నాయకులు వెంకటేశ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ధనుంజయలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T05:59:18+05:30 IST