విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వియరమణరావు
- మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
పెద్దపల్లి టౌన్, మార్చి 26: రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజే పీలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీఎమ్మెల్యే చిం తకుంట విజయరమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులకు పెద్ద పీట వేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటాయన్నారు. ఈ రెండు ప్రభు త్వాలు వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రైతులను ఆందోళన కు గురిచేస్తున్నారన్నారు. కేంద్రం రా రైస్ కొంటామని, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పిప్పుడు రాష్ట్రంలో ఉన్న నలుగురు ఎంపీలు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. గత యూపీఏ ప్రభుత్వంలో రై తులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి భారతీయ ఆహా ర సంస్థ గోదాముల్లో నిల్వ చేసిందని, కరువు కటాకాలు రాకపో వడంతో సముద్రంలో కలిపారని పేర్కొన్నారు. ఏనాడు వరి ధా న్యం కొనమని యూపీఏ ప్రభుత్వం చెప్పలేదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారం భించి గాలికి వదిలేశాడని ఆరోపించారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నా యకులు రైతుల పక్షాన పోరాడుతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపి ధాన్యం కొనుగోలు చేసి రైతుల కు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నూగిళ్ళ మల్లయ్య, నెత్తెట్ల కుమార్, భూతగడ్డ సంపత్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, వేముల వీరేషం, కొలిపాక శ్రావణ్, తదితరులున్నారు.