పార్లమెంట్ తొలి విడత సమావేశాలు బహిష్కరించిన టీఆర్ఎస్

ABN , First Publish Date - 2022-02-10T23:39:37+05:30 IST

పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. హౌస్‌కి లీడర్ అయిన ప్రధాని పార్లమెంట్‌ను..

పార్లమెంట్ తొలి విడత సమావేశాలు బహిష్కరించిన టీఆర్ఎస్

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. హౌస్‌కి లీడర్ అయిన ప్రధాని పార్లమెంట్‌ను కించపరిచారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన బిల్లు పట్ల ఫిబ్రవరి 8న ప్రధాని సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ ప్రొసీడింగ్స్,  ప్రిసైడింగ్ అధికారి అవమానించేలా,ప్రశ్నించేలా ప్రధాని వ్యాఖ్యానించారని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. సభా హక్కుల ఉల్లంఘించేలా ప్రధాని మాట్లాడారని, పార్లమెంట్‌ను కించ పరచడం కన్నా దుర్మార్గం మరోటి లేదన్నారు. సిగ్గుచేటు విధంగా అప్పటి ప్రభుత్వం బిల్లు ఆమోదం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.


 ‘‘పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం సమయంలో సభ ఆర్డర్‌లో లేనపుడు తలుపులు ముస్తారు. అది రూల్స్‌లో ఉంది. ప్రధానికి వ్యతిరేకంగా ఎవరు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వరు. ప్రధానికి రూల్స్ తెలిసి ఉంటాయి కాబట్టి ప్రధానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం మాకు కూడా బాధగానే ఉంది. తెలంగాణ ఏర్పాటులో సెంటిమెంట్ ఉంది. కాబట్టే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. అనేక మంది బలిదానాలు, ఉద్యమంతో  తెలంగాణ సాధించుకున్నాం. ప్రధాని వ్యాఖ్యలను ఎవరు ఓర్చుకోలేరు. బాధతో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. రాజ్యసభ చైర్మన్ లేరు కాబట్టి సభలో ప్రస్తావించా. సభా గౌరవం, హుందా, సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్, సీపీఎం, ఆర్జేడీ, తృణమూల్, శివసేన అందరూ మద్దతు ఇచ్చారు. చైర్మన్ లేడు కాబట్టి ఈరోజు ప్రివిలేజ్ మోషన్‌పై చర్చ జరగలేదు. చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి. తదుపరి ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆషామాషీగా ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ కాదు. సభా గౌరవం కోసం ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ ఇది. మా ప్రివిలేజ్ మోషన్‌పై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రధాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం, క్షమాపణలు చెప్తారని భావిస్తున్నాం. ప్రివిలేజ్ మోషన్‌పై నిర్ణయం తీసుకునేవరకు సభకు వెళ్లం.’’ అని ఎంపీ కేకే చెప్పారు.


Updated Date - 2022-02-10T23:39:37+05:30 IST