Trs Graph Falling: 30 మంది సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్..!

ABN , First Publish Date - 2022-09-07T02:05:39+05:30 IST

ముచ్చటగా మూడోసారి కూడా అధికార పగ్గాలు చేపట్టాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్‌ కు పార్టీ గ్రాఫ్ పడిపోతుండడం ఆందోళన కలిగిస్తుందట. ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా టీఆర్ఎస్...

Trs Graph Falling: 30 మంది సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్..!

హైదరాబాద్: ముచ్చటగా మూడోసారి కూడా అధికార పగ్గాలు చేపట్టాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్‌ (Cm Kcr)కు పార్టీ గ్రాఫ్ పడిపోతుండడం ఆందోళన కలిగిస్తుందట. ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా టీఆర్ఎస్ (Trs) తిరుగులేని మెజారిటీతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని గట్టి విశ్వాసంతో ప్రకటనలు చేసేవారు. ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. మీడియా ముందుకు వచ్చిన ఆయన 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని తేల్చి చెప్పారు. మార్చిలో మరో మారు అదే విషయం చెప్పారు. ఇక జూలైలో మంత్రి కేటీఆర్ (Minister Ktr) సైతం వంద స్థానాల్లో గెలుపు పక్కా అన్నారు. కానీ ఇప్పుడు ఆ ధీమా టీఆర్ఎస్‌లో లోపించిందట. అప్పటికీ ఇప్పటికీ టీఎర్ఎస్ గ్రాఫ్ తగ్గినట్లు కనిపిస్తోందట. స్వయంగా కేసీఆర్ మాటల్లోనే గ్రాఫ్‌ (Graph పడిపోతున్న సీన్‌ స్పష్టం అవుతోందట.



టీఆర్ఎస్ ఎల్పీ (Trslp) సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నాయట. ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా టీఆర్ఎస్ గ్రాఫ్‌ను పెంచి చెప్పే కేసీఆర్ లెక్కలు ఈసారి మాత్రం తగ్గాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే టీఆర్ఎస్ 70 నుంచి 80స్థానాల్లో గెలుస్తుందని ఎల్పీ భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 103గా ఉంది. అంటే ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం 23 నుంచి 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పకనే చెప్పేశారు. దీంతో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి మరింత పడిపోయే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. 


శాసన సభా పక్ష సమావేశంలో టీఆర్ఎస్ గెలుపు, ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో గులాబీ దళపతి కీలక కామెంట్స్ చేశారు. సిట్టింగులకే సీట్లనేది కేసీఆర్ విధానం అంటూనే కటింగ్ తప్పదనే క్లారిటీ కూడా ఇచ్చారు. టికెట్ వచ్చేది మీ చేతుల్లోనే ఉందని.. ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. చెడగొట్టుకుంటే ఏం చేయలేమని తేల్చి చెప్పారు. రెండు సార్లు చెప్పి చూస్తాం.. అయినా మార్పు లేకుంటే.. వేరే వాళ్లకు ఇవ్వక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలకు టెన్షన్ పెంచుతోందట. ఇంతకీ.. కేసీఆర్ జాబితాలో నెగిటివ్ రిపోర్ట్ తమపై ఎక్కడ వచ్చిందోనని ఆందోళన చెందుతున్నారట. 


ఇదిలావుంటే.. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. సిట్టింగులకే సీట్లు అంటూనే.. తీరు మార్చుకోకపోతే మార్పు తప్పదని చెప్పారు. దీంతో.. అసలు సిట్టింగులకు సీట్ల విషయంలో బుజ్జగించారా? లేక వార్నింగ్ ఇచ్చారా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. దీనిపై పార్టీలో డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఒక వైపు బీజేపీ దూకుడు పెంచింది. పదే పదే తెలంగాణలో కూడా షిండేలు ఉన్నారని బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్.. ఎల్పీ సమావేశం పెట్టి ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ వైపు చూడకుండా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారనే వాదన కొందరు వినిపిస్తున్నారు. దీనిలో భాగంగానే.. సిట్టింగులకు సీట్ ఇవ్వడమే కేసీఆర్ విధానమని ప్రకటించారని చెబుతున్నారు. 


మరోవైపు.. కేసీఆర్‌ ప్రకటనతో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖుషీగా ఉంటే.. మరికొందరు మాత్రం టెన్షన్ పడుతున్నారట. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్‌కు ప్రతీ సీటూ కీలకమే. కానీ.. ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే 23 నుంచి 33 సిట్టింగ్ స్థానాలను టీఆర్ఎస్ కోల్పోతుందని స్పష్టం అవుతోంది. అవి ఏ నియోజకవర్గాలో కూడా కేసీఆర్‌కు రిపోర్టులు ఉన్నాయి. దీంతో ఆయా స్థానాల ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు పని తీరు మార్చుకోవాలని సూచించి సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇస్తామన్నారు. అయినా మార్పు రాకపోవడంతో వారికి నెక్ట్స్‌ ఎలక్షన్స్‌లో టికెట్ ఇవ్వొ ద్దని కేసీఆర్‌ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. పీకే టీం చేసిన సర్వే రిపోర్ట్‌లను త్వరలోనే ఎమ్మెల్యేలకు అందజేస్తామని కూడా కేసీఆర్ చెప్పారు. దీంతో ఓడిపోయే జాబితాలో తమ పేరు ఎక్కడ ఉంటుందోనని కొందరిలో ఆందోళన నెలకొందట. మొత్తంగా కేసీఆర్‌ సర్వే రిపోర్టు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. ఇక 30మంది నెగటివ్‌ రిపోర్ట్‌ నేతలెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే..




Updated Date - 2022-09-07T02:05:39+05:30 IST