టీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు

ABN , First Publish Date - 2022-07-02T09:48:54+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ఇక భవిష్యత్తు లేదని తేల్చేశాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు

  • హుజూరాబాద్‌ ఎన్నికతో సుస్పష్టం
  • కాంగ్రెస్‌ శక్తి అనడాన్ని అంగీకరించను
  • టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే
  • వరి కొనుగోలు రాజకీయంలో 
  • నవ్వులపాలైన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో 
  • బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌



టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయం మేమే.. నిరంతరాయంగా కొనసాగుతున్న బీజేపీ ప్రయాణం

ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలుగా కాంగ్రెస్‌, ఇతరులు.. వరి కొనుగోలు రాజకీయంలో నవ్వులపాలైన కేసీఆర్‌


‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ఇక భవిష్యత్తు లేదని తేల్చేశాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఒక శక్తి అన్న విషయాన్ని తాను అంగీకరించనని, టీఆర్‌ఎ్‌సకు 

ఇప్పుడు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారిందని అన్నారు. కేసీఆర్‌ తమను వంచించారని ప్రజలు గ్రహించారని 

అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన నాటికీ ఇప్పటికీ దేశ, ప్రాంతీయ 

రాజకీయ పరిస్థితుల్లో ఎంతో తేడా వచ్చిందన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా శుక్రవారం 

ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..   


18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది?

అప్పటి రాజకీయ పరిస్థితులకూ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో మేం టీడీపీకి జూనియర్‌ భాగస్వామిగా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా మారాం.

అప్పట్లో ఇక్కడే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించి పార్టీ పరాజయం పాలైంది కదా! ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రయాణంలో ఏం మార్పు వచ్చింది?

నాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. మేం ఓడిపోయిన తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. నాడు టీడీపీతోపాటు దేశంలో రకరకాల ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ సారథ్యం వహించింది. నాటి బీజేపీ రూపురేఖలకూ, ఇప్పటి పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉంది. నాడు దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా లేదు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో దేశమంతటా బలమైన శక్తిగా రూపొందింది. ఇవాళ జాతీయ స్వభావం ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోయాయి. బీజేపీ ప్రయాణం నాటి నుంచి ఇప్పటి వరకూ నిరంతరాయంగా సాగుతోంది. రాజకీయాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేసే పార్టీ కాదు మాది. తెలంగాణలో ఎన్నో నియోజకవర్గాల్లో ఒకప్పుడు డిపాజిట్లు కోల్పోయేవాళ్లం. అయినా, మా కార్యకర్తల మనోస్థైర్యం చెక్కుచెదరలేదు. ప్రజల మధ్య కొనసాగుతూ, వారి సమస్యలను, బాధలను పట్టించుకుంటూ వారు తమ బాఽధ్యతలను నిర్వర్తించారు. 2004 నుంచి 2014 మఽధ్య కొనసాగిన ప్రభుత్వం.. కుంభకోణాలు, అవినీతి మఽధ్య కూరుకుపోయింది. వేలాది కోట్ల కుంభకోణాలు దేశ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి. దేశ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింది. నరేంద్ర మోదీ దేశాన్ని సవ్యమైన, సక్రమమైన, నిజాయితీతో కూడిన మార్గంలో తీసుకెళ్లారు. అవినీతి రహిత పాలనను అందించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ పెరిగింది. ఇది గణనీయమైన విజయం. అంటే, ఈ 18 ఏళ్లలో ఒక వ్యతిరేక పరిస్థితి నుంచి సానుకూల పరిస్థితుల్లోకి బీజేపీ ప్రయాణం కొనసాగింది. నిరాశాపూరిత వాతావరణం నుంచి విశ్వాసభరిత వాతావరణంలోకి బీజేపీ పాలన ప్రజలను తీసుకెళ్లింది. మొత్తంగా, దేశ ప్రజల సామూహిక మనస్తత్వంలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది.


2018 ఎన్నికల్లో తెలంగాణలో మీకు ఒక అసెంబ్లీ సీటు, 7% ఓట్లు మాత్రమే వచ్చాయి. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నంత మాత్రాన అది ఫలితాలను తేవాలి కదా? అందుకు మీ ప్రణాళికలేమిటి?


తెలంగాణలో బీజేపీ సమష్టి బృందంగా పనిచేస్తూ స్పష్టమైన లక్ష్యాలు విధించుకుంది. 2018లో టీఆర్‌ఎస్‌ కృత్రిమమైన కారణాల వల్లే గెలిచింది. కాంగ్రెస్‌, టీడీపీ కూటమిని ఒక భూతంగా చిత్రించి, ప్రజలను భయభ్రాంతులను చేయడంలో కేసీఆర్‌ కృతకృత్యులయ్యారు. కానీ, తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకోవడమే కాక, 19.45% ఓట్లను సాధించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది గణనీయమైన విజయం. ఇక, దుబ్బాకలో బీజేపీ అఖండ విజయం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీశ్‌ రావు నియోజకవర్గాల మధ్య ఉంది. అలాగే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపరిచి 150 సీట్లలో 48 సీట్లను గెలుచుకుంది. టీ ఆర్‌ఎ్‌సకూ, బీజేపీకి ఒకే శాతం ఓట్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎ్‌సకు బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మారింది. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయా, కాంగ్రెస్సా అంటే అత్యధిక సంఖ్యలో ప్రజలు బీజేపీవైపే మొగ్గు చూపుతున్నారు. ఇక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ఇక భవిష్యత్‌ లేదని తేల్చాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ రూ.600 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. కానీ, బీజేపీ అఖండ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. 2018 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఈ పరిణామాలన్నీ తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో స్పష్టం చేస్తున్నాయి.

కానీ, ఇప్పటికీ బీజేపీ కంటే కాంగ్రెస్‌ బలంగా ఉందని,  కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే మీ స్వప్నం నెరవేరుతుందా?

అసలు తెలంగాణలో కాంగ్రెస్‌ ఒక శక్తి అన్న విషయాన్ని నేను అంగీకరించను. వారికి అంతర్గత కుమ్ములాటలను పరిష్కరించుకునేందుకే సమయం లేదు. దేశంలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ చరిత్ర పుటల్లో కలిసిపోయింది. తెలంగాణ అందుకు మినహాయింపు కాదు. అఽధికారంలోకి రావాలని బీజేపీ కలలు కనడం లేదు. మేం అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలోనూ, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో తమకు మోదీ ఎంత అండగా నిలిచారో వారికి తెలుసు. అదే సమయంలో కేసీఆర్‌ ఏం చేశారో కూడా వారికి అర్థమైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేది ఒక స్పష్టమైన చారిత్రక సత్యం.

మీ నేతలు బలంగా ఉంటే కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి నేతలను ఎందుకు రప్పించుకుంటున్నారు? 

ఇతర పార్టీల నేతలను వశపరుచుకునే తత్వం బీజేపీది కాదు. కానీ, మంచి వ్యక్తులు బేషరతుగా, స్వచ్ఛందంగా చేరితే కాదనలేము. బీజేపీ ఎన్నడూ సిద్ధాంతం విషయంలో రాజీపడదు. మా పార్టీలో చేరే వారందరూ మా సిద్ధాంతాన్ని అంగీకరించాలి.  

తెలంగాణ బీజేపీలో ఒకే వర్గం ఓబీసీలున్నారని, మిగతా వారికి అంత ప్రాధాన్యం లేదన్న విమర్శపై?

ఈ విమర్శల్లో నిజం లేదు. మాకు దేశభక్తిలో విశ్వాసం ఉంది కానీ ఫలానా వర్గం, ఫలానా కులానికి మేం ప్రా ధాన్యం ఇచ్చే అవకాశం లేదు. భారతీయతే మా వర్గం.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌


ఇటీవల ప్రధాని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 

కేసీఆర్‌ ఆయనను స్వాగతించకపోవడంపై మీ అభిప్రాయం?

కేసీఆర్‌ వైఖరి ఏమాత్రం సరైనది కాదు. గౌరవనీయ ప్రధాన మంత్రికి ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ను విస్మరించడం కేసీఆర్‌కు సాధారణమైంది. దీన్ని నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను.


మతపరంగా సమాజాన్ని చీల్చడంపై మీరు ఆధారపడుతున్నార నేది మరో ఆరోపణ. మీ పార్టీ నాయకులు తరచూ మతపరమైన భాషను మాట్లాడతారు. మీ నేతలు చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి మందిరానికి వెళతారు. 2004లో ఇలా జరిగేది కాదు కదా?

బీజేపీకి దేశ శక్తిలో విశ్వాసం ఉంది. దేశ ప్రజలంతా సమైక్యమైనప్పుడే దేశం ఒక శక్తిగా మారుతుంది. అందుకే సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌ అని మోదీ నినాదం ఇచ్చారు. ప్రభుత్వ పాలనకు ఇదే మంత్రం అయినప్పడు మేము మతపరంగా సమాజాన్ని విడదీస్తామా? అయితే, బుజ్జగింపు రాజకీయాలకు మేం తీవ్ర వ్యతిరేకం. చార్మినార్‌ ముఖ్యమైనదే కానీ హిందువులకు భాగ్యలక్ష్మి మందిరం కూడా ముఖ్యమైనది. కొందరు వ్యక్తులు దేవత, మందిరం ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేసినప్పడు బీజేపీ కూడా ఒక వైఖరి తీసుకుంటుంది. అంత మాత్రాన మతతత్వాన్ని ప్రోత్సహించినట్లు కాదు.


తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని, కనీసం ధాన్యం కూడా కొనలేదని కేసీఆర్‌ నిందించారు. మీ జవాబేమిటి?

వరి సేకరణ విషయంలో ముఖ్యమంత్రి అనవసరంగా రాద్ధాంతం చేశారు. నిజానికి, అదొక పరిపాలనాపరమైన అంశం. ఆయనకెవరు సలహా ఇచ్చారో నాకు తెలియదు. కానీ, వరి కొనుగోలును రాజకీయం చేయాలని ప్రయత్నించి తనను తాను నవ్వుల పాలు చేసుకున్నారు. దేశ రాజధానిలో ధర్నా చేశారు. ఏమి సాధించారు? చివరకు ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తోందని అందరికీ తెలిసింది. కనీస మద్దతు ధరపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బోన్‌సను ప్రక టిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెల్లించిన ఎమ్మెస్పీపై అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించలేదు. హమాలీల చార్జీలు, గోనె సంచుల ధర, రవాణా చార్జీలతో సహా బియ్యం సేకరణకు అయిన మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. కేంద్రంపై దాడి చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన లక్ష్యం మిల్లర్లు, బ్లాక్‌ మార్కెటీర్లకు ప్రయోజనం చేకూర్చడమే.

Updated Date - 2022-07-02T09:48:54+05:30 IST