TSNews: పెన్షన్ల‌పై ఎమ్మెల్యే ముందే టీఆర్ఎస్ నేత అసంతృప్తి

ABN , First Publish Date - 2022-09-07T18:20:26+05:30 IST

కొత్త పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ ముందే టీఆర్‌ఎస్ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.

TSNews: పెన్షన్ల‌పై ఎమ్మెల్యే ముందే టీఆర్ఎస్ నేత అసంతృప్తి

జగిత్యాల: కొత్త పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ (Sanjay) ముందే టీఆర్‌ఎస్ నేత (TRS leader) అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు  ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా పెన్షన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాన్సల్ చేయడానికి చూపించే శ్రద్ధ ఇవ్వడంలో చూపించడం లేదన్నారు. టీఆర్‌ఎస్ నేతల వల్లే పెన్షన్ రావడం లేదని జనం అనుకుంటున్నారని చెప్పారు. అధికారుల తప్పుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతోందని దామోదర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-07T18:20:26+05:30 IST