మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి: Kadiyam

Published: Thu, 20 Jan 2022 12:05:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి: Kadiyam

హనుమకొండ: ఎంతో ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి జాతీయ హోదా కల్పించలేని దద్దమ్మలు బీజేపీ నేతలు అని వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ.... దళితుల, ఆదివాసుల, గిరిజనుల, మైనారిటీల ఆగ్రహానికి గురవుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కళలుకంటోందని... కానీ అవి కలగానే మిగిలిపోతాయని అన్నారు. ‘‘బండి సంజయ్ నీకు విశ్వవిద్యాలయాలపై అవగాహన ఉందా?’’ అని ప్రశ్నించారు. విషయపరిజ్ణానం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.