టీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌

ABN , First Publish Date - 2022-01-07T19:56:22+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.

టీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమాను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌చార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.


అసలేం జరిగిందంటే..

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ ప్రమేయం ఉందని, ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్వయంగా మృతుడు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో బయటకు రావడం పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మాటల దాడిని పెంచాయి. అటు వనమా వెంకటేశ్వరరావును తొలగించడంతో పాటు రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనలను తీవ్ర తరం చేస్తున్నాయి.


ఈ ఘటనపై ఐదు రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. రాఘవపై చర్యలకు టీఆర్ఎస్ పార్టీ ఉపక్రమించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుని వారం గడుస్తున్నా రాఘవను పోలీసులు ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. ఈ ఘటన తర్వాత రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన రాఘవ ఆ తర్వాత కనిపించకుండా పోయారు.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2022-01-07T19:56:22+05:30 IST