దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-04-24T05:06:32+05:30 IST

అచ్చంపేట మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారు లను తప్పు దోవ పట్టించి పెద్ద సం ఖ్యలో పలు వార్డుల్లో దొంగ ఓట్లను నమోదు చేయించారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ ఆరోపిం చారు.

దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌
తహసీల్దార్‌ కార్యాలయం ముందు బైఠాయించిన వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ

 అచ్చంపేటటౌన్‌, ఏప్రిల్‌ 23: అచ్చంపేట మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారు లను తప్పుదోవ పట్టించి పెద్ద సంఖ్యలో పలు వార్డుల్లో దొంగ ఓట్లను నమోదు చేయించారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ ఆరోపించారు. దొంగ ఓట్ల నమోదుకు ని రసనగా తహసీల్దార్‌ కార్యాలయం ముందు పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తుల పేర్లను కూడా అచ్చంపేట మునిసిపాలిటీ 10వ వార్డులో నమోదు చేయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార ని పేర్కొన్నారు. ఈ వార్డులో మొత్తం 119 బోగస్‌ ఓట్లు ఉండగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భీమారాణి ఇంట్లో 17 దొంగ ఓట్లు కాగా అదే ఇంటి నంబరుపై మరో 50 ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు.

Updated Date - 2021-04-24T05:06:32+05:30 IST