సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరం: Danam nagendar

ABN , First Publish Date - 2022-06-18T19:24:32+05:30 IST

సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరం: Danam nagendar

హైదరాబాద్: సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam nagendar) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అగ్నిపథ్ ప్రకటన తర్వాత దేశం అగ్నిగుండంగా మారిందని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత పరిస్థితేంటని యువకులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలని విమర్శించారు. దేశ యువకులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నాగేందర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-18T19:24:32+05:30 IST