రాహుల్, రేవంత్ ఇద్దరూ ఐరన్ లెగ్‌లు: Jeevan reddy

ABN , First Publish Date - 2022-05-05T17:25:41+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఐరన్ లెగ్‌లు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.

రాహుల్, రేవంత్ ఇద్దరూ ఐరన్ లెగ్‌లు: Jeevan reddy

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఐరన్ లెగ్‌లు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణకు రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నారో తెలియదని అన్నారు. నైట్ క్లబ్‌లో చైనా రాయబారితో ఉన్నది నిజం కాకపోతే బీజేపీ మీద పరువు నష్టం వేయాలన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థులు, రైతులకు ఏం చెబుతారో చెప్పి రావాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క రోజు రాహుల్ తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పి రావాలన్నారు. ‘‘మా పథకాలు మీ పాలిత రాష్ట్రాల్లో తెస్తామని చెప్పే ధైర్యం ఉందా రాహుల్’’ అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ పిచ్చి మాటలు మాట్లాడితే ఉరికించి కొడతారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Read more