కాంగ్రెస్ ది రైతు సంఘర్షణ సభ కాదు.. కొట్లాట సభ: Jeevan reddy

ABN , First Publish Date - 2022-05-07T18:40:07+05:30 IST

కాంగ్రెస్ ది రైతు సంఘర్షణ సభ కాదని...కాంగ్రెస్ కొట్లట సభ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ది రైతు సంఘర్షణ సభ కాదు.. కొట్లాట సభ: Jeevan reddy

హైదరాబాద్: కాంగ్రెస్ ది రైతు సంఘర్షణ సభ కాదని...కాంగ్రెస్ కొట్లట సభ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆయన రాహుల్ గాంధీ కాదని...రాజరికపు గాంధీ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్ కాదు..ఫ్రస్టేషన్ అని అన్నారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అని తెలిపారు. ఢిల్లీ వాసి రాహుల్... గల్లీలో సన్నాసి రేవంత్‌ను ఏం మాట్లాడాలని అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే పెండింగ్ ప్రాజెక్టులు.. కేసీఆర్ అంటే రన్నింగ్ ప్రాజెక్టులని చెప్పుకొచ్చారు. రాహుల్ ది ఐ రన్ లెగ్... ఆయన ఎక్కడ సభ పెట్టినా అక్కడ కాంగ్రెస్ ఔట్ అన్నారు. ‘‘రాహుల్ ఏ హోదాలో వచ్చావు... నువ్వు ఏమైనా కాంగ్రెస్ అధ్యక్షుడివా’’ అని ప్రశ్నించారు. రాహుల్ ఎలా డిక్లరేషన్ ప్రకటిస్తారని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి మీటింగ్ కు గైర్హాజరు అయ్యారన్నారు. రాష్ట్రానికి అనేక మంది టూరిస్టులు వస్తున్నారని....వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్‌కు గ్యారంటీ... వారంటీ రెండూ లేదన్నారు. జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని ఆరోపించారు. ‘‘మీది మొబిలైజేషన్..మాది సోషలైజేషన్. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. సోనియా ప్రధాన మంత్రా...ఆమె తెలంగాణ ఇవ్వడానికి’’ అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more