టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-12T16:00:30+05:30 IST

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

వరంగల్‌:  టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వానలోనే బాధితులను పరామర్శించానికి వెళ్తుండగా నల్లబెల్లి మండలం రేలకుంట దగ్గర ఎమ్మెల్యే కారు ముందు భారీ వృక్షం పడింది. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు, స్థానికులు వృక్షాన్ని తొలగించి రోడ్‌ను క్లియర్‌ చేశారు. 


కాగా... ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. విలయంలా వడగళ్ల వాన విరుచుకుపడింది. వడగళ్లతో వానకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేట డివిజన్‎లో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. కుప్పలు తెప్పలుగా వానరాళ్లు పెరుకుపోయాయి. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో గాలి వానకు పెద్ద పెద్ద చెట్లు నెలకొరిగాయి. వడగళ్ల వానకు మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-12T16:00:30+05:30 IST