ప్రజా దర్బార్ కాదు..బీజేపీ దర్బార్: Jeevan reddy

ABN , First Publish Date - 2022-06-11T17:41:32+05:30 IST

రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దర్బార్‌పై టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు.

ప్రజా దర్బార్ కాదు..బీజేపీ దర్బార్: Jeevan reddy

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దర్బార్‌పై టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మహిళా దర్బార్ నిర్వహించారన్నారు.  ప్రజా దర్బార్ కాదు.. బీజేపీ దర్బార్ అని విమర్శించారు. ఈడి, సీబీఐ, ఐటీలతో.. ప్రశ్నించే పార్టీల నేతలపై దాడులు చేస్తున్నారని అన్నారు.  ఈ మూడే కాదు నాలుగో వ్యవస్థగా గవర్నర్ వ్యవస్థను ప్రధాని మోదీ వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలపై సోకు ఉంటే... బండి సంజయ్‌ను తొలగించి తమిళ్ సైని నియమిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసైగల్లో 15 రాష్ట్రాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా దర్బార్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ‘‘గవర్నర్‌గా ఉండి మా గెలుపు ఖాయం మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు.. గవర్నర్  రాజకీయ పార్టీ నేతనా’’ అంటూ నిలదీశారు. యూపీ, మధ్యప్రదేశ్‌లో రేప్‌లు జరిగాయి అక్కడ అవసరం మహిళా దర్బార్‌లు అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపితే ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ ఆయన్నే ఎన్నుకున్నారన్నారు. రాజ్ భవన్‌ను రాజకీయ భవన్‌గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశరాు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ కుటుంబం ఎక్కడైనా చిన్న గుడి కట్టారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 


Updated Date - 2022-06-11T17:41:32+05:30 IST