రాహుల్... తెలంగాణకు స్వాగతం: Kavitha

ABN , First Publish Date - 2022-05-06T14:05:03+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

రాహుల్... తెలంగాణకు స్వాగతం: Kavitha

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘‘గౌరవ రాహుల్ గాంధీ, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ?. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు , నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం!!’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. 



Read more