
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధ పాలనకు విద్యుత్ నిరంతర సరఫరా ఒక్కటే చక్కని ఉదాహరణ అని ఎంపీ కే కేశవరావు అన్నారు. హైటెక్స్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేకే మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ది ముందు ప్రతిపక్షాల అబద్దాలు నిలువవన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం తీరు దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశం మార్పు కోరుకుంటోందని, దేశం అంతా కేసీఆర్ వైపు చూస్తోందని తెలిపారు. రాజ్యాంగ మీద బలమైన చర్చ జరగాలన్నారు. ‘‘దేశాన్ని బాగు చేయడానికి కేసీఆర్ బయలుదేరాలి...మేమంతా మీ వెంటే ఉంటాము’’ అంటూ కేకే పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి