లండన్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Jul 25 2021 @ 10:23AM

ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు

లండన్: ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో టీఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి తర్వాత కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ పార్టీని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆకాంక్షించారు. కేటీఆర్ తన పని తీరుతో బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.

కేటీఆర్ పిలుపు మేరకు "గిఫ్ట్ ఏ స్మైల్"లో భాగంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కూటీలను విరాళంగా ఇవ్వాలని కోరారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ వారు భారత్‌లో కూడా వివిధ చారిటీ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వీరా మాట్లాడుతూ.. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా రాష్ట్రానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని, మనమంతా ఎల్లప్పుడూ వారి వెంటే ఉండి వారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఎన్నారై టీఆర్ఎస్ లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం మాట్లాడుతూ.. కేటీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన, యావత్ ఎన్నారైల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

కేటీఆర్ గతంలో మంత్రిగా ఉండి దేశానికే ఆదర్శంగా నిలిచారని, ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అసూయ పడే విధంగా తన బాధ్యతలు నిర్వహించారని, ఇలాంటి మంత్రి మాకుంటే బాగుండు అని నాతోనే ఇతర రాష్ట్రాల ప్రవాసులు అన్నారని తెలిపారు. సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి మాట్లాడుతూ.. మేమంతా గర్వపడేలా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు తెలంగాణలో ఉండడం మన అందరి అదృష్టమని, వారి పిలుపు మేరకు కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా స్థానికంగా, తెలంగాణ రాష్ట్రంలో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 

ఎన్నారై టీఅఆర్ఎస్ సెల్ యూకే అధికార ప్రతినిధి రవి రేటినేని మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోభివృద్ది కృషి చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువచ్చారని కొనియాడారు. కేటీఆర్‌ను యువతరం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కేటీఆర్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వీరా, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి, లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం అధికార ప్రతినిధులు రవి కుమార్ రేటినేని, రవి ప్రదీప్ పులుసు, పృథ్వీ పాల్గొన్నారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.