టీఆర్ఎస్ ప్లీనరీలో విశేషాలు ఎన్నో...ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-10-24T21:18:37+05:30 IST

లంగాణ రాష్ట్ర సమితి పార్టీ(టీఆర్ఎస్) ద్వదశాబ్ధి ఉత్సలతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహించే ప్లీనరీకి ఆ పార్టీ నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లుచేస్తున్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీలో విశేషాలు ఎన్నో...ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(టీఆర్ఎస్) ద్వదశాబ్ధి ఉత్సలతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహించే ప్లీనరీకి ఆ పార్టీ నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హైటెక్స్ లో జరిగే ప్లీనరీకి ఏర్పాట్లుపూర్తి చేసినట్టు పార్టీ నాయకులు తెలిపారు.పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావుతో పాటు నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మంత్రి తలసాని అంతా తానై జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కటౌట్స్, జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా నగర మంతా గులాబీ రంగుతో కళకళాడుతున్నాయి. ప్రధానంగా నెక్లెస్ రోడ్ సర్కిల్, ప్యాట్నీ, ప్యారడైజ్, తెలుగు తల్లి ప్లై ఓవర్, బేగంపేట లోని సీఎం క్యాంప్ ఆఫీస్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జెండాలు, ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల ఫొటోలతో కూడిన హోర్డింగ్ లు ఆకట్టుకుంటున్నాయి. 


దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. వేదిక వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా ప్రతినిధులు, కార్యకర్తలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వారిలో హుషారు నింపేందుకు సాంస్కతిక కార్యక్రమాలను, ధూంధాం ఏర్పాటు చేస్తున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పధకాలకు సంబంధించిన పాటలు, టీఆర్ఎస్ ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలను వేదిక ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్నారు. 


వేలాదిగా తరలి వస్తున్న ప్రతినిధులు, పార్టీనాయకులు, కార్యకర్తలకు నోరూరించే వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రుచులను అందించేందుకు ప్రత్యేకంగా 29 రకాల నాన్ వెజ్ ఐటమ్స్, పలు రకాల వెజ్ ఐటమ్స్, స్వీట్లను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్లీనరీ సందర్భంగా వంటల కోసం 500 మంది వంటవాళ్లు పని చేస్తున్నారని మంత్రి తలసాని తెలిపారు. వేదిక వద్ద తెలంగాణ సంప్రదాయాలను తెలియజేసే చిత్రాలు, ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన పాత్రను తెలియజేసే చిత్రాలు హైలైట్ కానున్నాయని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. ప్లీనరీ వేదిక పై దాదాపు 100 మంది ముఖ్యులు కూర్చునే విధంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. 

Updated Date - 2021-10-24T21:18:37+05:30 IST