
హైదరాబాద్: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ఏకగ్రీవమయ్యారు. దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారి పత్రాలు అందజేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే ‘నమస్తే తెలంగాణ’ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ సీటు దక్కింది. అలాగే హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డికీ బెర్తు లభించింది. వీరిద్దరికీ ఆరేళ్ల పూర్తి పదవీ కాలం కలిగిన పెద్దలసభ సీట్లు లభించాయి. ఇక రెండేళ్ల పదవీ కాలం ఉన్న మరో స్థానానికి గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఎంపికయ్యారు. వీరిలో దామోదర్‌రావు (వెలమ), పార్థసారథిరెడ్డి ఓసీలు. రవిచంద్ర బీసీ. ఈసారి అనూహ్యంగా టీఆర్‌ఎస్ తరఫున రెండు రాజ్యసభ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కగా, మరొకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు దక్కింది.