20 నుంచి టీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు

ABN , First Publish Date - 2021-12-18T00:22:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో

20 నుంచి టీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం  కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పై తీవ్రస్థాయిలో ఆయన విరుచుపడ్డారు. బీజేపీతో తాడో పేడో తేల్చుకుందామన్నారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రిని కలవాలని మంత్రులను ఆదేశించారు. సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోండి..తేల్చుకొని రండని ఆయన స్పష్టం చేశారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారన్నారు. తాను కూడా ఎల్లుండి పర్యటనలు రద్దు చేసుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. 




 ధాన్యం సేకరణ, సింగరేణి బొగ్గుగనుల పట్ల కేంద్రం వైఖరిపై అనుసరించాల్సిన తీరుపై టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని  ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి అధ్యక్షులకు సూచించారు. దళితబంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. క్రాస్ ఓటింగ్‌పై జిల్లా మంత్రి పువ్వాడ నివేదిక అందజేశారు. క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించినవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రికి కేసీఆర్ సూచించారు. 


Updated Date - 2021-12-18T00:22:40+05:30 IST