TS News: కొమురం భీం: టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ

ABN , First Publish Date - 2022-08-18T18:09:23+05:30 IST

సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ (TRS) వర్సెస్ (VS) బీజేపీ (BJP)గా మారింది.

TS News: కొమురం భీం: టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ

కొమురం భీం (Komuram Bhim): సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ (TRS) వర్సెస్ (VS) బీజేపీ (BJP)గా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు అందెవల్లి వంతెన దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా లగ్గామ వంతెన వద్ద శ్రమదానానికి బీజేపీ నేత హరీష్ బాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న బీజేపీ నాయకులు సహా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాలతో అధికారులు లగ్గామ వద్ద అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించారు.

Updated Date - 2022-08-18T18:09:23+05:30 IST