టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌.. మాటల యుద్ధం!

ABN , First Publish Date - 2022-05-16T04:52:10+05:30 IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కొద్ది రోజుల నుంచి ఈ రెండు పార్టీల మధ్య మొదలైన విమర్శల పర్వం క్రమంగా ఇక్కడి రాజకీయాలను వేడేక్కిస్తోంది. ఇటీవలే ‘ఊరూరికి మహేఽశన్న’ కార్యక్రమం పేరిట ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి చేపడుతున్న పల్లెల పర్యటనలు ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌.. మాటల యుద్ధం!

జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటా పోటీగా విమర్శనాస్ర్తాలు 

మంత్రిని టార్గెట్‌ చేస్తున్న మహేశ్వర్‌ రెడ్డి 

మహేశ్వర్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నేతల కౌంటర్‌ ఎటాక్‌ 

జిల్లాలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టనున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

ఆచితూచీ అడుగులు వేస్తున్న బీజేపీ

నిర్మల్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లా కేంద్రంలో అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కొద్ది రోజుల నుంచి ఈ రెండు పార్టీల మధ్య మొదలైన విమర్శల పర్వం క్రమంగా ఇక్కడి రాజకీయాలను వేడేక్కిస్తోంది. ఇటీవలే ‘ఊరూరికి మహేఽశన్న’ కార్యక్రమం పేరిట ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి చేపడుతున్న పల్లెల పర్యటనలు ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మహేశ్వర్‌ రెడ్డి మఽధ్యాహ్నం వేళల్లో వివాహాలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ, కార్యకర్తలకు తన అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తూనే సాయంత్రం నుంచి రాత్రి వరకు పల్లెల్లో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రాఽధాన్యతను సంతరించుకుంటోంది. బహిరంగ సమావేశం లాగా కాకుండా ఆయ న ముఖాముఖీ చర్చ మాదిరిగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ వారికి ఉత్సాహం నింపడమే కాకుండా మనోధైర్యం కల్పించే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. దీంతో పాటు మహేశ్వర్‌ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై భూ కబ్జాల పేరిట ఆరోపణలు విమర్శలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. వరుసగా మహేశ్వర్‌ రెడ్డి మంత్రిపై చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఆ పార్టీ నేతలంతా మీడియా సమావేశం ఏర్పా టు చేసి మహేశ్వర్‌ రెడ్డిపై ఎదుడి దాడి ఏర్పాటు చేశారు. దీంతో పాటు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదంటూ కూడా హెచ్చరించడం చర్చకు తావిస్తోంది. అలాగే మహేశ్వర్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ నేతలు ఒకటి రెండు రోజుల్లో వరుస ఆందోళనలు చేపట్టేందుకు వ్యూహరచన చేయడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడేక్కించే అవకాశం ఉందంటున్నారు.  మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య మొదలైన ఆరో పణలు, విమర్శలు ఇక్కడి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు శ్రీకారం చుట్టబోతోదంటున్నారు. మహేశ్శర్‌ రెడ్డి తన పర్యటన సందర్భం గా చేరికలకు ప్రాధాన్యతనిస్తూ పావులు కదుపుతుండడం టీఆర్‌ఎస్‌ను అప్రమత్తం చేస్తోందంటుంన్నారు. 

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం..

నాలుగైదు రోజుల నుంచి కాంగ్రెస్‌ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన ఊరూరికి మహేశన్న కార్యక్రమం ఇక్కడి రాజకీయాలను వేడేక్కించేందుకు దోహదపడుతోందంటున్నారు. మహేశ్వర్‌ రెడ్డి వ్యూహాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం కొత్త సమీకరణలకు దారి తీసే అవకాశం లేకపోలేదంటున్నారు. బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా మహేశ్వర్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఓ వైపు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సంప్రదింపులు, సమాలోచనపలు జరుపుతూ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు చూస్తున్న ప్రయత్నాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మహేశ్వర్‌ రెడ్డి రచ్చబండ తరహాలో పార్టీ కేడర్‌తో నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమం కాంగ్రెస్‌ కొత్త జోష్‌ని ఇస్తోందని చెబుతున్నారు. మరోవైపు మహేశ్వర్‌ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ భూ కబ్జాలు, అవినీతి అక్రమల పేరిట విమర్శలు చేసి జనం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో చక్కర్లు  తావిస్తోంది.

మహేశ్వర్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి..

కొద్ది రోజుల నుంచి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుఉంటూ మహేశ్వర్‌ రెడ్డి విమర్శలు చేయ డం.. అ లాగే గ్రామాల్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండడం టీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పెడుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నేత మహేశ్వర్‌ రెడ్డిపై ఎదురుదాడి మొదలు పెట్టారు. ఓ వైవు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చేస్తున్న అభివృద్ధితో పాటు మహేశ్వర్‌ రెడ్డి లోపాలను ఆయనకున్న జనాధారణను ఎత్తి చుపుతూ కౌంటర్‌ ఎటాక్‌ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆదివారం టీఆర్‌ఎస్‌ నేతంతా మహేశ్వర్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కరిపిచండమమే  కాకుండా హద్దు మిరితే సహించేది లేదంటూ హెచ్చరించడం చర్చకు తావిస్తోంది.

ఆచితూచీఅడుగులు వేస్తున్న బీజేపీ..

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు హోరాహోరీగా పరస్పర విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వేడక్కిస్తుండా బీజేపీ నాయకులు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఈ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో నిర్మల్‌ నియోజకవర్గ నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఆ పార్టీ అగ్రనేత అమిత్‌ షా బహిరంగ సభకు కూడా జిల్లా నేతలంతా తరలివెళ్లారు. అలాగే బూత్‌ దర్శన్‌ కార్యక్రమం పేరిట బీజేపీ నేతలు గ్రామాలు, పట్టాణాల్లోని వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటుండడమే కాకుండా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విమర్శనాలు సందర్శిస్తున్నారు. ఇలా చాప కింద నీరులా బీజేపీ తనదైన శైలిలో రాజకీయ కార్యకలాపాలను సాగిస్తూ తన పట్టును మరింత పెంచుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారుతున్నాయి.

Updated Date - 2022-05-16T04:52:10+05:30 IST