టీఆర్‌ఎ్‌సవీ నాయకుల రాజీనామా

Jun 11 2021 @ 00:21AM

కమలాపూర్‌, జూన్‌ 10 : తెలంగాణ విద్యార్థి సమితి మండల విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు టీఆర్‌ఎ్‌సవీ మండల అధ్యక్షుడు కొలుగూరి రాజ్‌కుమార్‌ తెలిపారు. కమలాపూర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈటలకు మద్దతుగా తనతోపాటు మండల టీఆర్‌ఎ్‌సవీ కమిటీ, టీఆర్‌ఎ్‌సవీ గ్రామ శాఖల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా చేశామన్నారు. తామంతా ఈటల వెంటే ఉంటామని, ఈటల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు పిల్లి సతీష్‌, అరవింద్‌, పవన్‌, కళ్యాణ్‌, చోటే రాజ్‌, వినయ్‌, సాగర్‌, నాగరాజు, తిరుపతి, రవితేజ, బాలకిషన్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, అరుణ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: