జాతీయ రహదారిపై ట్రక్కులు బోల్తా

ABN , First Publish Date - 2021-03-07T05:05:53+05:30 IST

మండలంలోని ముసాయిపేట బంగారమ్మ ఆలయం వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం పలు వాహనాలు ఒక దానికొకటి ఢీకొనడంతో రెండు ట్రక్కులు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

జాతీయ రహదారిపై ట్రక్కులు బోల్తా
రహదారిపై బోల్తాపడిన ట్రక్కు

వెల్దుర్తి, మార్చి 6: మండలంలోని ముసాయిపేట బంగారమ్మ ఆలయం వద్ద  44వ జాతీయ రహదారిపై శనివారం పలు వాహనాలు ఒక దానికొకటి ఢీకొనడంతో రెండు ట్రక్కులు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అల్లం, ఎల్లిగడ్డ లోడుతో తూప్రాన్‌ నుంచి చేగుంటకు వెళుతున్న ట్రక్కు (టాటా ఏస్‌), జాతీయ రహదారిపై డివైడర్‌లోని మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకరును ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన మరో ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రెండు ట్రక్కులు బోల్తా పడ్డాయి. చేగుంట పోలీసులు వాటిని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


Updated Date - 2021-03-07T05:05:53+05:30 IST