ఛాతిలో బుల్లెట్ దిగి చొక్కా నిండా రక్తంతో వైరల్‌‌గా మారిన ఈ బాలుడి ఫొటో వెనుక అసలు నిజం ఇదీ..!

ABN , First Publish Date - 2022-04-06T00:21:02+05:30 IST

ఓ వైపు గొడవలు, అల్లర్లు జరుగుతుండగా.. మరో వైపు ఓ బాలుడు చొక్కా నిండా రక్తంతో మొకాళ్లపై కూర్చుని ఉంటాడు. నిశితంగా పరిశీలిస్తే.. అతడి ఛాతిలోకి బుల్లెట్ దిగిన ఆనవాళ్లు...

ఛాతిలో బుల్లెట్ దిగి చొక్కా నిండా రక్తంతో వైరల్‌‌గా మారిన ఈ బాలుడి ఫొటో వెనుక అసలు నిజం ఇదీ..!

ఓ వైపు గొడవలు, అల్లర్లు జరుగుతుండగా.. మరో వైపు ఓ బాలుడు చొక్కా నిండా రక్తంతో మొకాళ్లపై కూర్చుని ఉంటాడు. నిశితంగా పరిశీలిస్తే.. అతడి ఛాతిలోకి బుల్లెట్ దిగిన ఆనవాళ్లు కనిపిస్తాయి. వింటుంటేనే అయ్యో! పాపం.. అనిపిస్తోంది కదా. ప్రస్తుతం ఇలాంటి చిత్రం ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై సోషల్ మీడియాలో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక ) చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ.. జరిగిన ఆందోళనలో ఈ బాలుడు గాయపడ్డాడని దాని సారాంశం. అయితే చివరకు ఈ ఫొటో వెనుకున్న అసలు నిజం ఏంటంటే..


సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని నిబంధనలను పలుచన చేయడాన్ని నిరసిస్తూ 2018 ఏప్రిల్‌లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనలో చాలా మంది నిరసనకారులు గాయపడ్డారు. అలాగే పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఘజియాబాద్‌లో జరిగిన అల్లర్లలో నిఖిల్ ధోబి అనే బాలుడు పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడు అంటూ సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అయింది. మరోవైపు 2015లో మరో ట్విటర్ ఖాతాలో ఇదే ఫొటోను షేర్ చేశారు. పాలస్తీనాలో జరిగిన ఘటన అంటూ దాని సారాంశం. ఇలా ఒకే ఫొటోపై భిన్నాభిప్రాయాలు ఉండడంతో వీటిలో ఏది నిజం అని నెటిజన్లు సందేహంలో పడ్డారు. అయితే చివరగా తెలిసింది ఏంటంటే.. ఆ చిత్రం ట్యునీషియా దర్శకుడు చాకీ మెజ్రీ రూపొందించిన "ది కింగ్‌డమ్ ఆఫ్ యాంట్స్’’ అనే చిత్ర సన్నివేశం నుంచి తీసుకున్నదిగా తేలింది. ఆ చిత్రంలో బాలుడి సన్నివేశాన్ని స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు.

కొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..



Updated Date - 2022-04-06T00:21:02+05:30 IST