రిపోర్టర్ల రహస్యాలు సేకరించిన ట్రంప్.. ప్రముఖ పత్రిక ఆరోపణలు!

ABN , First Publish Date - 2021-05-08T22:44:51+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇక్కడి ప్రముఖ పత్రిక షాకింగ్ ఆరోపణలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తమ రహస్యాలు సేకరించిందని తెలిపింది.

రిపోర్టర్ల రహస్యాలు సేకరించిన ట్రంప్.. ప్రముఖ పత్రిక ఆరోపణలు!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇక్కడి ప్రముఖ పత్రిక షాకింగ్ ఆరోపణలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తమ రహస్యాలు సేకరించిందని తెలిపింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఆషామాషీ పత్రిక కాదు. ప్రపంచంలో ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్ పోస్ట్. 2016లో ట్రంప్ గెలుపొందిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనిపై రిపోర్టింగ్ చేస్తున్న తమ పత్రికకు చెందిన ముగ్గురు రిపోర్టర్ల ఫోన్ రికార్డులను ట్రంప్ ప్రభుత్వం రహస్యంగా సంపాదించిందని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. దీన్ని చొరబాటు చర్యగా అభివర్ణించిన పత్రిక తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ఎడిటర్ కామెరాన్ బర్ర్.. దీనికి కారణాలను న్యాయశాఖ స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-08T22:44:51+05:30 IST