బైడెన్ గెలిచినట్లు ప్రకటన.. ఆ సమయంలో ట్రంప్ ఏం చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2020-11-08T18:41:35+05:30 IST

మూడు రోజులు తీవ్ర ఉత్కంఠను కలిగించిన అమెరికా అధ్యక్ష ఫలితాలకు శనివారంతో తెర పడింది.

బైడెన్ గెలిచినట్లు ప్రకటన.. ఆ సమయంలో ట్రంప్ ఏం చేస్తున్నారంటే..

వర్జినియా: మూడు రోజులు తీవ్ర ఉత్కంఠను కలిగించిన అమెరికా అధ్యక్ష ఫలితాలకు శనివారంతో తెర పడింది. తరువాతి అమెరికా అధ్యక్షుడు ఎవరో తెలిపోయింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే... రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్ల వద్దే ఉన్నారు. దీంతో ప్రెసిడెంట్ కావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270ను(మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను) దాటిన బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 


ఇదిలాఉంటే... శనివారం ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో బైడెన్ గెలిచినట్లు ప్రకటన వస్తున్న సమయంలో ట్రంప్ ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా అయితే.. అందరూ టీవీల ముందు కూర్చొని తమ భవితవ్యం ఏంటా అని టెన్షన్ పడుతుంటారు. కానీ, ట్రంప్ సమ్‌థింగ్ స్పెషల్ కదా. అందరిలా కాకుండా కూసింత వైరైటీగా తన హాబీలో మునిగిపోయారు. ఇంతకు ట్రంప్ ఆ సమయంలో ఏం చేస్తున్నారో తెలుసా? తనకు ఎంతో ఇష్టమైన గోల్ఫ్ ఆడుతున్నారు. వర్జినియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ఉన్నారు. బైడెన్ గెలిచినట్లు ప్రకటన వచ్చిన చాలా సేపటి వరకు ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అందరూ ఈ విషయమై ఆరా తీశారు. దీంతో ఆ సమయంలో ట్రంప్.. గోల్ఫ్ ఆడుతున్నట్లు తెలిసింది. అంతేకాందండోయ్... ఆ సమయంలో గోల్ఫ్ క్లబ్ వద్ద అభిమానులతో ఫొటోలు కూడా దిగారాయన. ఇప్పుడు ట్రంప్ సంబంధించిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  

Updated Date - 2020-11-08T18:41:35+05:30 IST