బైడెన్.. అమెరికా చిన్నారులను కాపాడుకుందాం.. ట్రంప్ సూచన

ABN , First Publish Date - 2022-05-29T03:27:06+05:30 IST

మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చిన్నారులను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు.

బైడెన్.. అమెరికా చిన్నారులను కాపాడుకుందాం.. ట్రంప్ సూచన

ఎన్నారై డెస్క్: టెక్సాస్ రాష్ట్రంలోని స్కూల్‌లో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో సంచలనంగా మారింది. రామోస్ అనే 18 ఏళ్ల కుర్రాడు ఆ పాఠశాలలోకి చొరబడి.. 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లను పొట్టనపెట్టుకున్నాడు. ఈ క్రమంలో అమెరికా తుపాకీ సంస్కృతిపై మరోసారి చర్చ మొదలైంది. తుపాకీ తయారీ సంస్థల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల పిలుపునిచ్చారు కూడా! ఈ నేపథ్యంలోనే మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చిన్నారులను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు.  ‘‘యుక్రెయిన్‌కు 40 బిలియన్ డాలర్లను అమెరికా పంపిస్తోందంటే.. చిన్నారుల రక్షణ కోసం కూడా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. హ్యూస్టన్ నగరంలో నేషనల్ రైఫిల్ అసోసియేషష్ ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లలో భద్రత పెంచేందుకు నిధులు కేటాయించాలని సూచించారు. 



Updated Date - 2022-05-29T03:27:06+05:30 IST