ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-03-04T05:49:36+05:30 IST

మందారపూలను తైలంగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది

ఇలా చేసి చూడండి!

  • మందారపూలను తైలంగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది.
  • గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుని, కొద్దిగా వేడిచేసిన కొబ్బరినూనెతో ముఖాన్ని సున్నితంగా మర్దన చేయాలి. అలాగే  రాత్రంతా ఉండి పొద్దున్న చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా తయారవుతుంది.
  • లేత కొబ్బరితో ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది.
  • వేసవిలో నీళ్లల్లో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
  • ముఖంపై మొటిమలు ఉన్నవాళ్లు పెరుగులో కొద్దిగా సెనగపిండి వేసి పేస్టులా కలిపి దాన్ని ముఖానికి రాస్తే మొటిమలు పోతాయి.
  • పల్లీలు, బెల్లం కలిపి తింటే చర్మం తాజాగా ఉండడమే కాదు చర్మంపై ఉన్న మచ్చలు కూడా పోతాయి. 
  • మెంతుల్ని మెత్తటి పొడిలా చేసి స్క్రబ్‌ లేదా మాస్కులా వాడొచ్చు. ఇలా రోజూ చేస్తే చర్మంలోని మృతకణాలు పోతాయి. బ్లాక్‌హెడ్స్‌, జిడ్డుతనం కూడా పోతాయి. నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి గుజ్జుగా చేసి అందులో సెనగపిండి, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుంటే కళ్ల కింద ఉండే నల్లని  వలయాలు పోతాయి.

Updated Date - 2021-03-04T05:49:36+05:30 IST