Minister Vishwaroop:ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తా

ABN , First Publish Date - 2022-05-04T01:28:12+05:30 IST

ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కోసం తాను ప్రయత్నం చేస్తానని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

Minister Vishwaroop:ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్  కోసం ప్రయత్నిస్తా

విజయవాడ: లారీలపై తెలంగాణా ఇంటర్‌స్టేట్  కోసం తాను ప్రయత్నం చేస్తానని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మంగళవారం  లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఆత్మీయ అభినందన  సభ, మాజీ మంత్రి పేర్ని నాని కి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. ఈసందర్భంగా Minister Vishwaroop మీడియాతో మాట్లాడుతూ..గత మూడేళ్లుగా పేర్ని నాని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఈ శాఖని నడిపించారు.ఆయన ఏ విధంగా ఇప్పుడు ఆత్మీయ వీడ్కోలు అందుకుంటున్నారో అంతేవిధంగా తాను పనిచేసి ఆత్మీయ వీడ్కోలు పొందుతానని చెప్పారు. లారీ ఓనర్స్ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.లారీ ఓనర్స్ అంటే మాస్ అనుకున్నా కాని క్లాస్ కూడా ఉందని తెలుసుకున్నానని తెలిపారు. కోవిడ్ కారణంగా గత రెండున్నర ఏళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా  సీఎం జగన్మోహన్‌రెడ్డి పలు కార్యక్రమాలు చేపట్టారన్నారు. రవాణా రంగం ఎట్టి పరిస్ధితుల్లో బాధలు పడకూడదన్నారు.. అన్ని రంగాలుగా ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్పారు. ఆరు నెలలకొకసారి సమావేశం నిర్వహించుకుందామన్నారు.అవసరమైతే cm jaganతో సమావేశమయ్యేలా ఏర్పాటు చేస్తానని మంత్రి పినిపే విశ్వరూప్ హామీ ఇచ్చారు. 

Read more